Shankar: శంకర్ ఆ ఛాన్స్ ను వాడుకుంటాడా?

రామ్ చరణ్(ram charan) హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(shankar) చేసిన గేమ్ ఛేంజర్(game changer) సినిమా డిజాస్టర్ అవడంతో శంకర్ కు మరో ఛాన్స్ దక్కలేదు. గేమ్ ఛేంజర్ తర్వాత శంకర్ కు మరో స్టార్ హీరోను ఒప్పించడం చాలా కష్టమైంది. అయినా శంకర్ ముందు ఓ గోల్డెన్ అవకాశముంది. గత కొంత కాలంగా సక్సెస్ లేని శంకర్ అపరిచితుడు(aparichithudu) సినిమాకు సీక్వెల్ ను తీస్తే ఆ మూవీతో తిరిగి కంబ్యాక్ అయ్యే ఛాన్సుంది.
కొన్నేళ్ల ముందు రిలీజైన అపరిచితుడు మూవీకి మంచి క్రేజ్ ఉంది. పైగా అపరిచితుడులోని స్ట్రాంగ్ సోషల్ మెసెజ్ కు ఈ తరం ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు. అలాంటి మూవీకి సీక్వెల్ చేస్తే ఆడియన్స్ శంకర్ ను నమ్మే అవకాశం ఉంది. పైగా శంకర్ ఇప్పుడున్న సిట్యుయేషన్స్ కు స్టార్ హీరో కావాలంటే విక్రమ్(vikram) కరెక్ట్ ఛాయిస్. అపరిచితుడులో నటించిన హీరో కూడా విక్రమే కాబట్టి ఈ సినిమా కు అతనే మంచి ఆప్షన్.
మరోవైపు విక్రమ్ కూడా గత కొన్ని సినిమాలుగా చెప్పుకోదగ్గ హిట్ దక్కలేదు. అతని మార్కెట్ కూడా బాగా డల్ అయింది. ఈ నేపథ్యంలో శంకర్- విక్రమ్ కాంబినేషన్ బాగా వర్కవుట్ అయ్యే అవకాశముంది. వీరిద్దరూ సక్సెస్ లో లేకపోయినా గతంలో వీరి కాంబోలో వచ్చిన మూవీ హిట్ అవడంతో ఈ కాంబో వర్కవుట్ అయితే మాత్రం మొదటి నుంచే ఆ ప్రాజెక్టుపై మంచి బజ్ ఏర్పడే ఛాన్సుంది. అటు శంకర్ తో పాటూ ఇటు విక్రమ్ కు కూడా ఇది సువర్ణ అవకాశమే. మరి శంకర్ ఈ గోల్డెన్ ఛాన్స్ ను అయినా అందుకుంటారా లేదా అన్నది చూడాలి.