నాని టైర్2 రికార్డును మళ్లీ కొడతాడా?
దసరా, హాయ్ నాన్న సినిమాలతో వరుస హిట్లు అందుకున్న నేచురల్ స్టార్ నాని ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాతో మరో హిట్ అందుకుని హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు నాని. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలుండగా, ట్రైలర్ రిలీజయ్యాక ఆ అంచనాలు ఇంకా పెరిగిపోయాయి.
డిఫరెంట్ కాన్సెప్ట్ తో మాస్, యాక్షన్ జానర్ లో ఈ సినిమా రాబోతుందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ముందు ఇప్పుడో టార్గెట్ ఉంది. నాని దసరా సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో డే1 24.85 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి టైర్ 2 హీరోల్లో ఎక్కువ ఓపెనింగ్స్ అందుకున్న హీరోగా నాని రికార్డు క్రియేట్ చేశాడు.
ఇప్పటివరకు ఆ రికార్డును మిగిలిన టైర్2 హీరోలెవరూ టచ్ చేయలేకపోయారు. రామ్ పోతినేని స్కంద, డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినప్పటికీ ఈ రికార్డుని మాత్రం టచ్ చేయలేకపోయాడు. విజయ్ దేవరకొండ, రవితేజ సినిమాలు కూడా ఆ రికార్డు దరిదాపుల్లోకి రాలేదు. ఇప్పుడు మరోసారి నానికి ఆ ఛాన్స్ వచ్చింది. దసరా రికార్డును బ్రేక్ చేయడానికి కావాల్సినంత స్కోప్ సరిపోదా శనివారం కు ఉంది. డే1 రూ.25 కోట్లు కలెక్ట్ చేస్తే ఆ రికార్డు బ్రేక్ అవుతుంది. మరి ఈ రేర్ ఫీట్ ని నాని ఎంతవరకు అందుకోగలడో చూడాలి.













