యష్ తో జత కట్టనున్న కియారా?
కేజీఎఫ్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న యష్ ప్రస్తుతం తన కొత్త సినిమా టాక్సిక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. నెక్ట్స్ ఇయర్ సినిమాను ఎలాగైనా రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. టాక్సిక్ రెగ్యులర్ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. హీరోయిన్ ను సెలెక్ట్ చేయాల్సి ఉంది. అప్పట్లో కరీనా కపూర్ ను తీసుకున్నారన్నారు. కానీ అది నిజం కాదని ఆమె టీమ్ క్లారిటీ ఇచ్చింది.
తాజాగా టాక్సిక్ లో హీరోయిన్ పాత్ర కోసం చిత్ర యూనిట్ కియారా అద్వానీని సంప్రదించినట్లు సమాచారం. ప్రస్తుతం కియారా గేమ్ ఛేంజర్ చివరి దశ షూటింగ్ కోసం తెలుగు రాష్ట్రాల్లోనే తిరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కియారాని డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఒక ఆప్షన్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కాకపోతే టాక్సాక్ కోసం కియారా డేట్స్ తీసుకోవడమే అసలు ప్రాబ్లమ్.
ప్రస్తుతం రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న డాన్ 3లో హీరోయిన్ గా నటిస్తున్న కియారా, వార్2 కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకవేళ టాక్సిక్ ఒప్పుకోవాలంటే కాల్షీట్స్ సెట్ చేసుకోవాలి. గీతూ టాక్సిక్ కోసం బల్క్ గా డేట్స్ అడిగిందని టాక్. కాబట్టి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ కియారా సెట్ అవకపోతే శృతి హాసన్ పేరును కూడా పరిశీలిస్తున్నారట. మరి ఆఖరికి యష్ తో ఎవరు జత కడతారన్నది చూడాలి.













