తండ్రీ కొడుకుల సెంటిమెంట్ రిపీటవుతుందా?
తక్కువ గ్యాప్ లో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవడం మామూలే కానీ తండ్రీ కొడుకుల సినిమాలు మాత్రం తక్కువ గ్యాప్ లో రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. 2016లో డిసెంబర్ 9న చరణ్ ధృవ రిలీజై బ్లాక్ బస్టర్ కాగా, 2017 జనవరి 11న ఖైదీ నెం.150 రిలీజై సూపర్ హిట్ అయింది. ఇదంతా గతం. ఇక ఇప్పుడు విషయానికొస్తే డిసెంబర్ లో గేమ్ ఛేంజర్ క్రిస్మస్ కానుకగా రిలీజవుతుందని దిల్ రాజు నిన్న అఫీషియల్ గా చెప్పారు. క్రిస్మస్ కానుక అన్నప్పటికీ దానికి అయిదారు రోజుల ముందొస్తేనే పాన్ ఇండియా రేంజ్ కు తగ్గ సక్సెస్ అవుతుంది. ఒకవేళ అదే జరిగితే గేమ్ ఛేంజర్ రిలీజైన 20 రోజులకు జనవరి 10న చిరంజీవి విశ్వంభర రిలీజ్ కానుంది.
నార్మల్ గా చూసుకుంటే రెండు సినిమాల మధ్య మూడు వారాల గ్యాప్ అనేది తక్కువైనప్పటికీ ఇంతకంటే బెటర్ ఆప్షన్ గేమ్ ఛేంజర్ కు లేదు. దీంతో మెగా ఫ్యాన్స్ గతాన్ని గుర్తు చేసుకుంటూ తండ్రీ కొడుకుల సెంటిమెంట్ మరోసారి రిపీట్ అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ రిలీజ్ ప్లాన్ లో ఎలాంటి మార్పులుండేట్లు కనిపించడం లేదు.













