అఖిల్ చేయలేనిది చైతూ సాధిస్తాడా?
హీరోల గత సినిమాల రిజల్ట్‌ని ఆధారంగా చేసుకుని కొత్త సినిమాల బడ్జెట్ ఉంటుంది. హీరో స్టామినాకు మించి ఖర్చు పెడితే ఏమవుతుందో చెప్పడానికి చాలా సినిమాలే ఉదాహరణలుగా ఉన్నాయి. అక్కినేని హీరో అఖిల్ ని నమ్ముకుని ఏజెంట్‌ను రూ.80 కోట్ల బడ్జెట్ తో తీస్తే ఆ సినిమా రిజల్ట్ ఏమైందో అందరికీ తెలిసిందే.
అసలు ఒక్క హిట్ కూడా లేని అఖిల్ ని నమ్మి అంత బడ్జెట్ ఎలా పెట్టారని అడిగితే అఖిల్ కాబోయే సూపర్‌స్టార్ అన్నాడు నిర్మాత అనిల్ సుంకర. తర్వాత సినిమా డిజాస్టర్ అవడంతో ఫుల్ స్క్రిప్ట్ లేకుండా సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడం వల్లే ఏజెంట్ కు ఈ పరిస్థితి వచ్చిందని నిర్మాత మీడియా సాక్షిగా చెప్పాడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు అఖిల్ అన్నయ్య నాగ చైతన్య మీద కూడా ఇదే రేంజ్ బడ్జెట్ తో సినిమా తెరకెక్కనుంది. చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుందని, ఈ క్రమంలో సినిమా బడ్జెట్ రూ.200 కోట్లు అని కూడా వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఈ సినిమా రూ.80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనుందని సమాచారం.
చైతూ ని నమ్మి ఈ రేంజ్ బడ్జెట్ అంటే సాహసమనే చెప్పాలి. కానీ కంటెంట్‌ను నమ్మి ఈ సినిమాపై ఇంత మొత్తంలో బడ్జెట్ పెడుతున్నారని టాక్. ఎలాంటి నమ్మకం లేకుండా గీతా ఆర్ట్స్ ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ పెట్టదు. మరి అఖిల్ ఫెయిల్ అయిన ఈ బడ్జెట్లో చైతూ సక్సెస్ అవుతాడా? గీతా ఆర్ట్స్ నిర్మాతల నమ్మకాన్ని నిలబెడతాడా అన్నది చూడాలి.













