టిల్లు స్క్వేర్ సైలెంట్ గా ఉన్నాడేంటి?
డీజే టిల్లుతో సెన్సేషనల్ హిట్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డ తన తర్వాతి సినిమాగా టిల్లు స్వ్కేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ అంచనాలతో రానుంది. అంతేకాదు టిల్లు స్క్వేర్ కు బడ్జెట్ కూడా భారీగా పెడుతున్నారని సమాచారం. ఈ సినిమా వాస్తవానికి ఆగస్ట్ లో రిలీజ్ కావాల్సింది. తర్వాత సెప్టెంబర్ లో అనుకున్నారు.
ఫైనల్ గా అక్టోబర్ 6న రిలీజ్ అన్నారు. కానీ టిల్లు స్వ్కేర్ చెప్పిన తేదీకి కూడా వచ్చేలా కనిపించడం లేదు. కానీ ఈ సినిమా ఎప్పుడొచ్చినా మంచి హిట్ కొడతామని అంటున్నాడు. సిద్దు కాన్ఫిడెన్స్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా అనుపమ ఈ సినిమాలో ఫుల్ గ్లామర్ షో చేసిందని టాక్.
డీజే టిల్లులో రాధిక క్యారెక్టర్ ను మించి ఈ సినిమా లో అనుపమ రోల్ ఉంటుందని అంటున్నారు. చెప్పిన దాని ప్రకారం ఈ సినిమా రిలీజ్ కు వారం రోజులే ఉంది. కానీ ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. టిల్లు స్వ్కేర్ రిలీజ్ వాయిదా పడిందా అని అనుకుంటున్నారు. ఈ విషయంలో ఏదైనా సరే మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.













