లాక్ డౌన్ లో ఎన్టీఆర్ మలయాళం ఎందుకు నేర్చుకుంటున్నాడు?
తెలుగులో టాకీ సినిమాలు మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు వేల సినిమాలు వచ్చాయి. అయితే అందులో నటించిన నటులు కేవలం మొహంలో హావాభావాలు పలికించడమే కాదు. శరీరంలో ప్రతీ పార్టు అందుకు తగినంతగా స్పందించి. పాత్రలో ఇమిడిపోయే స్వభావం ఉంటేనే ఆ నటుడు ఆ పాత్రలో సరిగ్గా నటించగలుగుతాడు అన్నది ఆనాటి నుండి ఈనాటి వరకు ఎంతో మంది నటి నటులు రుజువు చేసారు. అయితే అప్పట్లో నటి నటులు తన గొంతు తోనే మాటలు పాటలు పద్యాలు కూడా పలికేవారు. ఆ తరువాత ఆయా నటుడు, నటి గొంతు ప్రజాదరణ నోచుకోకపోతే డబ్బింగ్ చెప్పించి ఆ పాత్రను రక్తి కట్టేంచేవారు.













