దిల్ రాజు మౌనమెందుకు?
తన బ్యానర్ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే చాలు, దిల్ రాజు ప్రమోషన్ల వర్షం కురిపిస్తుంటాడు. కానీ ఈ శనివారం మే 25న రిలీజ్ కాబోతున్న లవ్ మీ ఇఫ్ యు డేర్ విషయంలో మాత్రం దిల్ రాజు మౌనం పాటిస్తున్నాడు. ది ఫ్యామిలీ స్టార్ రిలీజ్ టైమ్ లో దిల్ రాజు ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించడం, ఆయన చెప్పిన మాటలన్నీ కూడా ఆ సినిమా రిజల్ట్ చూశాక నీరుకారిపోయాయి.
అందుకే లవ్ మీ సినిమా మీద, కంటెంట్ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా సినిమా సక్సెస్ అయ్యాకే మాట్లాడాలని డిసైడయ్యాడు. లవ్ మీ నిర్మాత తన కూతురే అయినప్పటికీ మొత్తం అన్నీ తానై చూసుకున్నాడు దిల్ రాజు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఎక్కువ మాట్లాడకుండా పొలిటీషియన్స్ కు జూన్ 4 ఎలాగో మే 25 తమకు అలా అని టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
అంతేకాదు తాజాగా మహేష్ తో ఎక్స్ వేదికగా ఓ సాంగ్ ను రిలీజ్ చేసి సినిమాపై హైప్ ను పెంచే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించినప్పటికీ ఆశించిన స్థాయిలో సినిమాకు బజ్ రాకపోవడం విశేషం. బేబీ హీరోయిన వైష్ణవి బ్రాండ్ కూడా సినిమాకు ఏం కలిసిరాలేదు. ఇవన్నీ చూస్తుంటే రిజల్ట్స్ చూశాకే దిల్ రాజు ఈ సినిమా విషయంలో స్పీడ్ పెంచనున్నట్లు తెలుస్తోంది. దెయ్యాన్ని ప్రేమించే పాయింట్ తో వస్తున్న లవ్ మీ ఇఫ్ యు డేర్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి మరి.













