నెక్ట్స్ ఏంటి సమంతా?
గతేడాది విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సమంతకు ఆ సినిమా అనుకున్న ఫలితాన్నివ్వలేకపోయింది. ఆ తర్వాత మయోసైటిస్ కారణంగా కొంతకాలం పాటూ సినిమాలకు దూరంగా ఉన్న సమంత, మళ్లీ హెల్త్ సెట్ అయ్యాకే యాక్టింగ్ పై ఫోకస్ చేయాలని అనుకుంది.
ఇప్పుడిప్పుడే ఆరోగ్యపరంగా కోలుకుంటున్న సమంత ఈ ఏడాది తిరిగి నటిగా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే సిటాడెల్ వెబ్ సిరీస్ పూర్తి చేసిన సమంత దాని రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. ఈ సిరీస్ తనకు బాలీవుడ్ లో మంచి అవకాశాలను తెచ్చిపెడుతోందని సమంత ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది.
బాలీవుడ్ లో బిజీ అయితే తర్వాత సౌత్ లో కూడా ఛాన్సులొస్తాయనే ఆలోచనలో సమంత ఉందట. ఇదిలా ఉంటే చాలా రోజుల నుంచి సమంత బాలీవుడ్ లో ఓ స్టార్ తో సినిమా చేయబోతుందని ప్రచారం జరుగుతుంది. అక్షయ్ కుమార్ సమంతను బాలీవుడ్ కు పరిచయం చేయబోతున్నాడని వార్తలు కూడా వచ్చాయి. దాంతో పాటూ ఆయుష్మాన్ ఖురానాతో ఓ సినిమా ఓకే అయిందని టాక్ వినిపించింది. కానీ వీటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు మాత్రం ఇంకా రాలేదు. అట్లీ- బన్నీ కాంబోలో రానున్న సినిమాలో కూడా సమంత హీరోయిన్ గా ఫిక్స్ అయిందంటున్నారు. ఈలోపు సమంత ఏవైనా ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేస్తుందేమో చూడాలి. ఏదేనా సరే సమంత ఇక సినిమాలకు గ్యాప్ ఇవ్వకుండా వీలైనంత త్వరగా తన తర్వాత ప్రాజెక్ట్స్ ను మొదలుపెడితే బెటర్.













