వచ్చే వారం బాక్సాఫీస్ విజేత ఎవరో..?
ఎప్పుడూ లేని విధంగా 2021 సమ్మర్ లో ఎక్కువ సంఖ్యలో సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇదివరకు ఎవరో ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు సమ్మర్ లో సెట్ చేసుకునే వారు. కానీ కరోనా తర్వాత స్టార్ నుంచి అప్ కమింగ్ యాక్టర్స్ వరకూ అందరూ రిలీజ్ ల కోసం ఎగబడుతున్నారు. కేవలం ఏడాది మొదలైన నుంచి ఇప్పటికే 50 నుంచి 70 సినిమాలు రిలీజ్ అయి ఉంటాయి. కానీ అన్నింటికీ థియేటర్లుండవు కాబట్టి కొన్ని డిజిటల్ రిలీజ్ అంటూ అటు, మరికొందరు థియేట్రికల్ రిలీజ్ అంటూ మొత్తం కలిపి ఆ సంఖ్యలో రిలీజ్ అయ్యాయి. అయితే ఏప్రిల్ 2న చాలా సినిమాలే రిలీజ్ అవుతున్నాయి.
అందులో మూడు సినిమాలే అందరికీ వినిపిస్తున్నాయి. గోపీచందర్ సీటీమార్, కార్తీ సుల్తాన్, పునీత్ రాజకుమార్ యువరత్న. ఈ మూడు సినిమాలూ ఏప్రిల్ 2న రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. కానీ ఇందులో సిటీమార్ తప్పించి మిగిలిన రెండూ డబ్బింగ్ సినిమాలే. ఈ రోజుల్లో నేరుగా రిలీజ్ అవుతున్న సినిమాలనే ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు కాబట్టి డబ్బింగ్ సినిమాలపై జనాలు ఇంట్రెస్ట్ చూపించడం కష్టమే. అందుకే వచ్చే వారం సినిమాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సిటీమార్. అంతే కాదు రిలీజ్ దగ్గర పడుతున్నా కానీ వాటి ప్రమోషన్స్ కూడా సరిగా చేయట్లేదనే టాక్ బాగా ఉంది. ఈ సినిమాలతో పాటూ నాగ్ నటించిన వైల్డ్ డాగ్ కూడా ఆ రోజునే రిలీజ్ కానుంది. మరి ఈ నాలుగు సినిమాల్లో వచ్చే వారం ఏ సినిమా విజేతగా నిలుస్తుందో చూడాలి.













