ఈ సారి సంక్రాంతి విజేత ఎవరో?
ప్రతి సంవత్సరం సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు, చిన్న హీరోల సినిమాలు రిలీజ్ అవడం కామనే. ఈ ఏడాది సంక్రాంతికి కూడా చిరంజీవి, బాలయ్య సినిమాలు వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు రిలీజై మంచి టాక్ తో మెప్పించాయి. వీటితో పాటూ విజయ్ సినిమా కూడా రిలీజ్ అయి మంచి కలెక్షన్లే రాబట్టుకుంది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ పోటీ మరింత పెరగనుంది.
ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉన్న ఏకైక సినిమా కల్కి. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా సంక్రాంతికి రిలీజయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ సినిమా రాదని తెలుసుకున్న వెంటనే చాలా మంది తమ సినిమాలను సంక్రాంతి బరిలో దింపడానికి రెడీ అయిపోయారు. అందులో మొదటగా అనౌన్స్ చేసిన సినిమా మహేష్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారం.
ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తామంటూ హీరోతో పాటూ, దర్శకనిర్మాతలు కూడా చెప్తున్నారు. దీంతోపాటూ నాగార్జున నా సామి రంగ కూడా సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు సినిమా అనౌన్స్ చేసిన రోజే చెప్పారు. రీసెంట్ గా సంక్రాంతి బరిలోకి వెంకటేష్ నటిస్తున్న సైంధవ్ కూడా వచ్చి చేరింది. ఇది కాకుండా విజయ్ దేవరకొండ-పరశురామ్ పెట్ల కాంబోలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా కూడా సంక్రాంతికి రానుంది.
తేజ సజ్జ హీరోగా వస్తున్న హనుమాన్ సంక్రాంతికి రావడం పక్కా అని పదే పదే గుర్తు చేస్తున్నారు. సంక్రాంతికి మరో మూడు నెలల టైమ్ ఉంది కాబట్టి రిలీజ్ టైమ్ దగ్గరకొచ్చేసరికి మరికొన్ని సినిమాలు ఈ లిస్ట్ జాయిన్ అయ్యే ఛాన్సుంది. అనౌన్స్ చేసిన సినిమాలు పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సూ ఉంది. మరి ఇన్ని సినిమాల్లో సంక్రాంతి విజేతగా ఏ సినిమా నిలుస్తుందో, ఏ సినిమా సంక్రాంతికి నష్టాన్ని చవిచూస్తుందో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.













