నెక్ట్స్ వీక్ బాక్సాఫీస్ విన్నర్ ఎవరో?
అయితే ఒకేసారి ఎక్కువ సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవడం లేదంటే ఆ శుక్రవారం అసలు ఒక్క సినిమా కూడా రాకపోవడం ఈ మధ్య టాలీవుడ్లో తరచూ జరుగుతుంది. ఈ నెలలో రెండు వారాలు అలానే వేస్ట్ చేశారు నిర్మాతలు. డబ్బింగ్ సినిమాలైన మార్క్ ఆంటోనీ, సప్త సాగరాలు దాటి తప్ప వాటిని యూజ్ చేసుకోలేకపోయాయి.
సలార్ సినిమా పోస్ట్ పోన్ అవడమే దీనికి కారణంగా చెప్పొచ్చు. అందుకే ఈ నెల చివరి వారంలో ఒకేసారి స్కంద, చంద్రముఖి2, పెదకాపు1 సినిమాలు పోటీ పడాల్సిన పరిస్థతి వచ్చింది. ఇక అసలు విషయానికొస్తే దసరా కు ఎలాగూ స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి కాబట్టి మొదటి వారంలో చిన్న, మధ్య తరహా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.
అందులో భాగంగానే సుధీర్ బాబు మామా మశ్చీంద్ర, కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ సినిమాలు వరుసలో ఉన్నాయి. వీటితో పాటూ నాగవంశీ నిర్మాణంలో మ్యాడ్ సినిమా కూడా అక్టోబర్ 6నే రిలీజ్ అవుతుంది. ఈ సినిమా చూసిన వాళ్లకు నవ్వు రాకపోతే డబ్బులు వెనక్కు ఇస్తానని నాగవంశీ ఛాలెంజ్ చేసి సినిమాపై హైప్ పెంచాడు. దీంతో పాటూ మంత్ ఆఫ్ మధు కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటూ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ 800, నయనతార-జయం రవిల గాడ్ కూడా ఇదే పోటీలో నిలవనుంది. మరి వీటిలో ఏ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించి విన్నర్‌గా నిలుస్తుందో చూడాలి.













