Ram Charan: చరణ్ నెక్ట్స్ అతనితోనా?

ఆస్కార్ అవార్డు తీసుకొచ్చిన ఆర్ఆర్ఆర్(RRR) వంటి భారీ హిట్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్‌చరణ్(Ram Charan) ఆ సక్సెస్‌తో ప్రపంచ వ్యాప్తంగా తన మార్కెట్‌ను మరింత పెంచుకున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత దిల్‌రాజ్(Dil Raju) నిర్మాతగా, శంకర్(Shankar) దర్శకత్వంలో ఎన్నో ఆశలు పెట్టుకుని గేమ్ ఛేంజర్(Game Changer) మూవీ చేయగా, ఆశించిన ఫలితాలను అందుకోలేకపోవడంతో పాటు వసూళ్ల పరంగా కూడా నిరాశపర్చింది. ఈ రిజల్ట్‌తో తన తదుపరి ప్రాజెక్ట్స్‌ను పట్టాలు ఎక్కించడంలో రామ్‌చరణ్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు.
ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన(Buchi babu Sana) తెరకెక్కిస్తున్న పెద్ది(Peddhi) మూవీ షూటింగ్‌లో రామ్‌చరణ్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ రామ్‌చరణ్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా అంచనాలను తారాస్థాయికి పెంచేసింది. అయితే, ఈ సినిమా అనంతరం రామ్‌చరణ్ నటించే తదుపరి ప్రాజెక్టుపైనే కొంత గందరగోళం నెలకొంది. రామ్‌చరణ్‌కు రంగస్థలం(Rangasthalam) సినిమాతో మంచి హిట్ ఇచ్చిన సుకుమార్‌తో రామ్ చరణ్ 17వ సినిమా ఉంటుందని చాలా కాలం నుంచి టాక్ నడుస్తోంది.
తాజాగా సుకుమార్(Sukumar) బదులు త్రివిక్రమ్(Trivikram)తో రామ్‌చరణ్ తన తదుపరి సినిమా చేయనున్నాడనే వార్త సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. అయితే, ఈ ప్రచారంలో నిజం లేదని మెగా కాంపౌండ్ నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఆర్సీ17 సుకుమార్‌తోనే ఉంటుందని, ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో సుకుమార్ బిజీగా ఉన్నాడని సమాచారం. కాబట్టి పెద్ది సినిమా, సుకుమార్ ప్రాజెక్టు తర్వాతే త్రివిక్రమ్- చరణ్ మూవీ ఉంటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.