రాజమౌళి సెంటిమెంట్‌ను బ్రేక్ చేసేదెవరు?
రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఏ హీరో అయినా సరే ఆయన సినిమా తర్వాత కొన్నాళ్ల పాటు కెరీర్లో కష్టాలు ఎదుర్కోవాల్సిందే. ఆ విషయం ఇప్పటికే చాలామంది హీరోల విషయంలో ప్రూవ్ అయింది. చరణ్ మగధీర నుంచి మొన్న ప్రభాస్ బాహుబలి వరకు కూడా ఇదే రిపీటవుతూ వచ్చింది. రాజమౌళితో సినిమా చేయాలని ఎంతగా ఉన్నా, ఆ తర్వాత కెరీర్ ఏంటి అని హీరోలు ఆందోళన చెందే పరిస్థితి.
అసలు విషయానికొస్తే ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోలుగా నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కూడా ప్రస్తుతం తమ తర్వాతి సినిమాలు చేస్తున్నారు. చరణ్ ఎప్పుడో శంకర్ దర్శకత్వంలో సినిమాను మొదలుపెట్టి షూటింగ్ చేస్తుండగా, ఎన్టీఆర్ రీసెంట్గా కొరటాల డైరెక్షన్లో సినిమాను స్టార్ట్ చేశాడు. వీరిద్దరిలో రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ ను ఎవరు బ్రేక్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రాజమౌళి సినిమాతో పాన్ ఇండియన్ లెవల్లో క్రేజ్ దక్కించుకున్నారు ఎన్టీఆర్, చరణ్. వాళ్ల తర్వాతి సినిమాలతో ఆ ఇమేజ్ను కాపాడుకుంటేనే ఆ క్రేజ్ అంతే ఉంటుంది. లేదంటే క్రెడిట్ మొత్తం రాజమౌళికే వెళ్తుంది.
ఇద్దరిలో ఏ హీరో తన రేంజ్‌ని కాపాడుకుని, నెక్ట్స్ లెవల్‌కు వెళ్తారనేది చూడాలి. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే ఇంకో ఏడాది పాటు ఆగాల్సిందే. చాలా తక్కువ గ్యాప్ తోనే ఈ ఇద్దరు స్టార్ హీరోలు వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వారి సినిమాలు రిలీజ్ అయితేనే ఎవరి స్టామినా ఏంటనేది తెలిసేది.













