ప్రొడ్యూసర్ అల్లు బాబీ ఎక్కడ?
అల్లు అరవింద్ కొడుకుగా అల్లు బాబీ సుపరిచితుడే. తండ్రి బాటలోనే నిర్మాణ రంగంలోకి ఎంట్రీ కూడా ఇచ్చాడు. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గని సినిమాతో నిర్మాతగా పరిచయమయ్యాడు బాబీ. అప్పటి వరకు వేరే బిజినెస్లు చూసుకున్న బాబీ, మొదటి సారి సినీ ఇండస్ట్రీలోకి వచ్చి చేస్తున్న సినిమా కావడంతో ఆ సినిమాకు ఖర్చు కూడా బాగానే పెట్టాడు.
కానీ మొదటి సినిమాతోనే బాబీకి చాలా గట్టి షాక్ తగిలింది. భారీ అంచనాల మధ్య రిలీజైన గని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత బాబీ నుంచి మరో సినిమా వచ్చింది లేదు. కనీసం మరో సినిమాను బాబీ అనౌన్స్ కూడా చేయలేదు. మొన్నటివరకు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అయినా అప్పుడప్పుడు కనిపించే వాడు కానీ ఇప్పుడక్కడ కూడా కనిపించడం లేదు.
దీంతో బాబీ తెర వెనుక ఏమైనా గట్టిగా ప్లాన్ చేస్తున్నాడా అనే డౌట్స్ అందరిలోనూ మొదలయ్యాయి. ఎలాగూ తండ్రి అల్లు అరవింద్ తర్వాత గీతా ఆర్ట్స్ ను నడిపించాల్సింది బాబీనే. ఎందుకంటే అల్లు అర్జున్ నటుడిగా చాలా బిజీ అయ్యాడు. శిరీష్ తనను తాను నటుడిగా ప్రూవ్ చేసుకోవడంలో బిజీగా ఉన్నాడు. కాబట్టి గీతా ఆర్ట్స్ వ్యవహారాలను చూసుకునే బాధ్యత బాబీ పైనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బాబీ బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడా అని ఫ్యాన్స్ అనుమానాలు రేకెత్తిస్తున్నారు. చూడాలి మరి త్వరలో బాబీ నుంచేమైనా బ్లాక్ బస్టర్ న్యూస్ వస్తుందేమో!













