Suriya: తప్పు ఎక్కడ జరుగుతుంది సూర్య?
సినిమాల ఎంపిక విషయంలో ఎవరైనా సరే సరైన నిర్ణయం తీసుకోకపోతే భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. అయితే ఆ నష్టమనేది ప్రతీసారి డబ్బు రూపంలోనే ఉండకపోవచ్చు. క్రేజ్ పరంగా, మార్కెట్ పరంగా వారి స్థాయి తగ్గుతుంది. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) పరిస్థితి అలానే ఉంది. రీసెంట్ గా రిలీజైన పరాశక్తి(Parashakthi) టీజర్ ను చూశాక సూర్య ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు.
దానికి కారణం ఈ సినిమాను ముందుగా అనుకున్నది సూర్యతోనే. ఆకాశం నీ హద్దురా(Aakasam Ni Haddhura) కలయికను మరోసారి రిపీట్ చేయాలనే ఆలోచనతో సుధా కొంగర(Sudha Kongara) ఈ సినిమాను అనౌన్స్ చేసింది. కంటెంట్ సెన్సిటివ్ గా ఉండటంతో తర్వాతేమైనా వివాదాలొస్తాయేమోనని సూర్య ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆ సినిమాను శివ కార్తికేయన్(Siva Karthikeyan) తో చేసి టీజర్ ను రిలీజ్ చేశారు.
పరాశక్తి టీజర్(Parasakthi Teaser)కు ఇప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఒకవేళ ఆ సినిమాను సూర్యనే చేసి ఉంటే ఇంతకంటే గొప్ప రెస్పాన్స్ వచ్చేది. మరి పరాశక్తిని వద్దనుకుని సూర్య ఏదైనా నెక్ట్స్ లెవెల్ ప్రాజెక్ట్ చేస్తున్నాడా అంటే ఇంకా డైరెక్టర్ గా పూర్తి స్థాయిలో నిరూపించుకోని ఆర్జె బాలాజీ(RJ Balaji)తో సినిమా చేస్తున్నాడు. ఇదొక్కటే కాదు, శిరుత్తై శివ(Siruthai Siva)ను గుడ్డిగా నమ్మి కంగువ విషయంలో కూడా సూర్య ఇంతే మోసపోయాడు. వీటితో పాటూ రీసెంట్ గా వెంకీ అట్లూరి(Venky Atluri)తో అనుకున్న సినిమాను కూడా సూర్య వదులుకున్నాడని, ఇప్పుడా సినిమా ధనుష్(Dhanush) చేతికి వెళ్లిందని సమాచారం. ప్రస్తుతానికి సూర్య ఆశలన్నీ రెట్రో(Retro) సినిమాపైనే ఉన్నాయి.













