NTR-NBK: బాబాయ్ అబ్బాయ్ ఆ టార్గెట్ ఎప్పుడు అందుకుంటారో
నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna), ఎన్టీఆర్(Ntr) ఇద్దరికీ ఓ విషయంలో ఓ సారూప్యత ఉంది. వారిద్దరూ ఆ సారూప్యతను కొనసాగించడం ఫ్యాన్స్ ఎదురుచూపులను మరింత పెంచుతుంది. 2011 నుంచి 2014 వరకు వరుస ఫ్లాపులు చూసిన ఎన్టీఆర్ టెంపర్(Temper) సినిమా నుంచి ట్రాక్ లో పడ్డాడు. ఆ తర్వాత నుంచి కథలు, దర్శకులను జాగ్రత్తగా ఎంచుకుంటూ ఓవర్సీస్ ఆడియన్స్ ను టార్గెట్ చేయడం స్టార్ట్ చేశాడు.
దాని వల్లే టెంపర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన సినిమాలన్నీ మంచి రిజల్ట్స్ అందుకున్నాయి. కానీ ఆర్ఆర్ఆర్ తప్పించి మిగిలిన ఏ సినిమా ఇండస్ట్రీ హిట్ కాలేకపోయాయి. సింహాద్రి(Simhadri) తర్వాత ఎన్టీఆర్ మళ్లీ ఆ రేంజ్ ర్యాంపేజ్ అందుకున్నది లేదు. ప్రశాంత్ నీల్(Prasanth Neel) తో చేస్తున్న సినిమాతో ఎన్టీఆర్ ఆ ఫీట్ ను సాధించే అవకాశముంది.
బాలయ్య(Balayya) కూడా ఎన్టీఆర్ బయోపిక్(NTR Biopic), రూలర్Ruler) సినిమాల తర్వాత నుంచి లైన్ లోకి వచ్చాడు. వరుసగా ఇప్పుడు బాలయ్య నాలుగు హిట్లు అందుకున్నాడు. కానీ సీనియర్లలో చిరంజీవి(Chiranjeevi), వెంకటేష్(Venkatesh) సాధించిన వంద కోట్లకు పైగా షేర్ మాత్రం బాలయ్య ఇంకా అందుకోలేదు. బోయపాటి(Boyapati)తో చేస్తున్న అఖండ2 తాండవం(Akhanda2 Thandavam)తో ఆ టార్గెట్ అందుకోవాలని బాలయ్య చూస్తున్నాడు. మరి బాబాయ్, అబ్బాయి ఆ టార్గెట్స్ ను ఎప్పుడు అందుకుంటారో చూడాలి.













