విశ్వక్కు ఆ మైల్ స్టోన్ ఎప్పుడు దాటతాడో?
సినిమా సినిమాకూ తన రేంజ్ ను మరింత పెంచుకుంటూ వరుస సినిమాలు చేస్తూ తన కెరీర్ లో దూసుకెళ్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్సేన్. తన నుంచి సినిమా వస్తుందంటే ఏదో స్పెషల్ ఉండే ఉంటుందనే నమ్మకాన్ని విశ్వక్ ఆడియన్స్ లో కలిగించగలిగాడు. ఈ ఏడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో మంచి ఫలితాన్ని అందుకున్నాడు విశ్వక్.
విశ్వక్ తను చేస్తున్న సినిమాలతో మంచి హిట్స్ ను తన అకౌంట్ లో వేసుకుంటున్నప్పటికీ ఇప్పటి వరకు తన ఖాతాలో రూ.100 కోట్ల సినిమా ఒక్కటి కూడా లేదు. తనతో పాటు సమాన ఇమేజ్ కలిగిన హీరోలందరూ ఇప్పటికే ఆ క్లబ్ లో చేరిపోగా విశ్వక్ మాత్రం ఇంకా ఆ మార్క్ కు దూరంలోనే ఉన్నాడు. దీంతో విశ్వక్ రకూ.100 కోట్ల సినిమా ఏదవుతుందనేది ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రూ.100 కోట్ల క్లబ్ లో చేరుతుందనుకున్నారు కానీ కలెక్షన్స్ పరంగా ఆ సినిమా చెప్పుకోదగ్గ ఫలితాన్నివ్వలేకపోయింది. ప్రస్తుతం విశ్వక్ లైలా, మెకానిక్ విక్కీ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా విశ్వక్ రేంజ్ ను పెంచే విధంగానే తెరకెక్కుతున్నాయి. మరి ఈ సినిమాలతో అయినా విశ్వక్ రూ.100 కోట్ల మార్క్ ను అందుకుంటాడేమో చూడాలి.













