Kishore Tirumala: కిషోర్ తిరుమలకు హీరోలు దొరకడం లేదా?
రైటర్ గా, డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న కిషోర్ తిరుమల(Kishore Tirumala) నుంచి సినిమా వచ్చి రెండున్నరేళ్లయింది. ఆయన్నుంచి వచ్చిన ఆఖరి సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు(Aadallu Miku Joharlu). నేను శైలజ(Nenu Sailaja), ఉన్నది ఒకటే జిందగీ(Unnadhi Okate Zindagi), చిత్రలహరి (Chitralahari) లాంటి యూత్ ఫుల్ లవ్ స్టోరీలతో తనదైన ప్రత్యేకతను చాటుకున్న కిషోర్ తిరుమల ఇప్పటి వరకు తన కొత్త సినిమాను అనౌన్స్ చేసింది లేదు.
మరి కిషోర్ కు ఛాన్సులు రావడం లేదా లేక వచ్చినా తాను అనుకున్న హీరోలు కనెక్ట్ అవడం లేదా? ఫామ్ లో ఉన్న హీరోలు డేట్లు ఇవ్వడం లేదా ఇలా ఎన్నో డౌట్స్ వస్తున్నాయి. ఫామ్ లో ఉన్న హీరోలంతా బిజీగా ఉండటంతో కొత్త సినిమాలకు డేట్స్ ఇచ్చే సిట్యుయేషన్స్ లో లేరు. లైమ్ లైట్ లో ఉన్న డైరెక్టర్లను చూసి మరీ వాళ్ల కథలకే ఓకే చెప్తున్నారు.
ఫ్లాప్ డైరెక్టర్లతో రిస్క్ తీసుకోవడం లేదు. కిషోర్ తిరుమల ఆఖరి సినిమాలు రెడ్(Red), ఆడవాళ్లు మీకు జోహార్లు అనుకున్నంతగా అంచనాలు అందుకోలేకపోవడంతో ఆ ఎఫెక్ట్ కిషోర్ ఛాయిస్లపై పడింది. మరి న్యూ ఇయర్ లో అయినా కిషోర్ ఏదైనా సినిమాతో గుడ్ న్యూస్ చెప్తాడేమో చూడాలి. ఫామ్ లో ఉన్న హీరోల్ని పక్కనపెట్టి తనదైన స్టోరీతో కొత్త వాళ్లతో సినిమా చేసే దిశగా అడుగులేస్తాడేమో చూడాలి.













