అల్లరి నరేష్ ఆ రికార్డు ఎప్పుడు బ్రేక్ చేస్తాడో?
డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లరి నరేష్ మొదటి సినిమా అల్లరితోనే మంచి హిట్ కొట్టి దాన్నే ఇంటిపేరుగా మార్చుకున్నాడు. తర్వాత వరుసగా కామెడీ సినిమాలు చేస్తూ తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. సుడిగాడు సినిమా వరకు నరేష్ చేసిన సినిమాలన్నీ మంచి హిట్లే.
అయితే నరేష్ కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా సుడిగాడు నిలిచింది. ఈ సినిమాకు రూ.18 కోట్ల షేర్ కలెక్షన్స్ రూపంలో వచ్చాయి. సుడిగాడు తర్వాత కూడా నరేష్ కామెడీ కథలతో సినిమాలు చేశాడు కానీ అవి కమర్షియల్ గా మాత్రం వర్కవుట్ అవలేదు. దీంతో నెమ్మదిగా నరేష్ మార్కెట్ పడిపోయింది.
అందుకే జానర్ మార్చి చాలా గ్యాప్ తీసుకుని నాంది అనే సీరియస్ సినిమా చేసి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా రూ.9.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ తర్వాత మళ్లీ మరో సీరియస్ సినిమా చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే నరేష్ ఎప్పటినుంచో సుడిగాడు సినిమాకు సీక్వెల్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. దాని కోసం కథ కూడా తానే రెడీ చేసుకున్నాడట. మరోవైపు ప్రస్తుతం నరేష్ బచ్చలమల్లి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ఎలాగైనా మంచి హిట్ అందుకుంటాననే నమ్మకంతో నరేష్ ఉన్నాడు. మరి నరేష్ తన ఓన్ రికార్డు రూ.18 కోట్లను ఏ సినిమాతో బ్రేక్ చేస్తాడో చూడాలి.













