త్రివిక్రమ్ ఇంత గ్యాప్ ఇస్తే ఎలా?
గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్లీ ఎక్కడా కనిపించింది లేదు. గుంటూరు కారం సక్సెస్ మీట్ లో కూడా నిర్మాత నాగవంశీ, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కనిపించారు కానీ త్రివిక్రమ్ కనిపించలేదు. సినిమా రిజల్ట్ తెలిసే మీడియా ముందుకు రాలేదని, ట్రోలింగ్స్ ఆయన దృష్టికి వెళ్లి బాగా హర్ట్ అయ్యారని అన్నారు.
ఇదంతా గతం కదా అనుకుంటే త్రివిక్రమ్ తర్వాతి సినిమా ఏంటి? ఎవరితో అనేది మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. బన్నీతో ఇప్పటికే ఓ పాన్ ఇండియా సినిమాను అనౌన్స్ చేశారు కానీ ఆ తర్వాత దాని గురించి ఎలాంటి అప్డేట్స్ లేవు. ఇప్పట్లో ఆ సినిమా మొదలయ్యే సూచనలు కూడా కనిపించడం లేదు. దానికి సంబంధించిన స్క్రిప్ట్ ఇంకా రెడీ కాలేదు.
రెడీ అయినా ఒకటికి పది సార్లు స్క్రిప్ట్ చెక్ చేసుకోవాలి. క్యాస్టింగ్, బడ్జెట్, ప్రొడక్షన్ వర్క్స్ ఇలా ఎన్నో పనులుంటాయి. ప్రస్తుతం పుష్ప2 చేస్తున్న బన్నీ, ఆ తర్వాత అట్లీతో సినిమాకు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే. కాబట్టి త్రివిక్రమ్ – బన్నీ కాంబో సెట్స్ పైకి వెళ్లాలంటే మరికాస్త టైమ్ పట్టనుంది. మరోవైపు నానితో సినిమా అంటున్నారు కానీ అందులో ఎలాంటి నిజం లేదని నాని లైనప్ చూస్తుంటే అర్థమవుతుంది. ఏదేమైనా ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా త్రివిక్రమ్ తన తర్వాతి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.













