వార్2.. అసలేం జరుగుతోంది?
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకి చేరుకుంది. దీంతో పాటూ తారక్ బాలీవుడ్ లో వార్2 అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. తారక్ ఈ సినిమా ద్వారానే బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.
ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న వార్2 వచ్చే ఏడాది ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్ త్వరలోనే మొదలుకానుందట. ఈసారి మేకర్స్ లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో హృతిక్ తో పాటూ ఎన్టీఆర్ కూడా పార్టిసిపేట్ చేయనున్నాడని తెలుస్తోంది. ఇద్దరి మధ్య పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ ను ఈ షెడ్యూల్ లో షూట్ చేయనున్నారట.
హిట్ మూవీ వార్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. దానికి తోడు ఎన్టీఆర్ ఈ సినిమాలో భాగమవడంతో ఆ అంచనాలు ఆకాశాన్నంటాయి. హృతిక్, తారక్‌ను ఒకేసారి బిగ్ స్క్రీన్ పై చూడాలని మూవీ లవర్స్ అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కు బాలీవుడ్ లో క్రేజ్ పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా కూడా హిట్ అయితే తారక్ నెక్ట్స్ బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటే అవకాశముంది.













