Shruthi Hassan: పోటీపై శృతి హాసన్ ఏమంటుందంటే

ఇండస్ట్రీలో ఒకేరోజు రెండు పెద్ద సినిమాలు రిలీజవడం ఇప్పుడు చాలా కామనై పోయింది. దీంతో సినిమాల ఓపెనింగ్స్ తో పాటూ కలెక్షన్లు కూడా షేర్ అవుతున్నాయి. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాలు రావడం లేదు. ఇప్పుడు ఆగస్ట్ 14న కూలీ(Coolie), వార్2(war2) సినిమాలు ఒకే రోజున పాన్ ఇండియా స్థాయిలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే.
దీంతో కూలీ వర్సెస్ వార్2 తప్పదని అంతా ఫిక్సయ్యారు. అయితే ఇదే విషయాన్ని కూలీ సినిమాలో కీలక పాత్రలో నటించిన శృతి హాసన్(Sruthi Haasan) ను అడగ్గా బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు పోటీ పడటం సహజమేనని, తాను నటించిన సినిమాలు వేరే పెద్ద సినిమాలతో చాలా సార్లు పోటీగా రిలీజయ్యాయని, అయితే ఎన్ని సినిమాలు రిలీజైనా దేని స్పెషాలిటీ దానికి ఉంటుందని శృతి తెలిపింది.
సినిమాల మధ్య పోటీ విషయంలో నటీనటులు ఏమీ చేయలేరని, ఈ విషయంలో నిర్మాతలే ఆలోచించి సినిమా, సినిమాకీ మధ్య గ్యాప్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలని శృతి చెప్పింది. వార్2, కూలీ రెండు సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారని, వారికి వాటిని చూసే టైమ్ ఇవ్వాలి కదా అని శృతి అభిప్రాయపడింది. కాగా లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో రజినీకాంత్(rajinikanth) హీరోగా తెరకెక్కిన కూలీ సినిమాలో శృతి హాసన్ కీలక పాత్రలో నటిస్తుండగా, ఆ ప్రమోషన్స్ లో భాగంగా శృతి ఈ కామెంట్స్ చేశారు.