Nidhhi Agerwal: లిప్ లాక్ సీన్స్ గురించి నిధి ఏమంటుందంటే

సవ్యసాచి(savyasachi) సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన నిధి అగర్వాల్(Nidhhi Agerwal) ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ అమ్మడికి స్టార్‌డమ్ మాత్రం అందని ద్రాక్షలానే మిగిలింది. నిధి ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ తన ఖాతాలో ఇస్మార్ట్ శంకర్(Ismart Shankar) తప్ప మరో హిట్ లేదు. ఎలాగోలా పవన్(pawan) సరసన హరి హర వీరమల్లు(Hairhara veeramallu), ప్రభాస్(Prabhas) సరసన రాజా సాబ్(Raja Saab) సినిమాల్లో చోటు దక్కించుకున్న నిధి ప్రస్తుతం వీరమల్లు ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi), ఏఎం జ్యోతికృష్ణ(AM Jyothi Krishna) దర్శకత్వంలో తెరకెక్కిన వీరమల్లు సినిమా జులై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిధి అగర్వాల్ ఈ సినిమా కోసం ఐదేళ్ల పాటూ కష్టపడింది. ఈ సినిమా కోసం భరతనాట్యం, గుర్రపు స్వారీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న నిధి అగర్వాల్ తనకు మాస్ హీరోయిన్ అవాలని ఉన్నట్టు మనసులోని కోరికను బయటపెట్టింది.
మరి మాస్ హీరోయిన్ అవాలంటే లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్స్ లాంటివి చేయాలి కదా అంటే, అలాంటవన్నీ చేయనని, తన లిమిట్స్ తనకు తెలుసని, తన పేరెంట్స్ తో కలిసి చూడలేని సీన్స్ ను తాను చేయలేనని, అలాంటి సీన్స్ చేయకపోయినా మాస్ హీరోయిన్ అవొచ్చని, దాని కోసం కష్టపడతానని నిధి తెలిపింది. మరి నిధి కోరుకున్న ఆ మాస్ హీరోయిన్ ఇమేజ్ ఆమెకు ఎప్పటికి దక్కుతుందో చూడాలి.