ఆ విషయంలో కఠినంగా ఉంటున్న మృణాల్
కెరీర్ స్టార్టింగ్ లో బాలవుడ్ లో సీరియల్స్ చేసిన మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ సినిమా మృణాల్ కెరీర్ ను మార్చేసింది. సీతారామంకు ముందు మృణాల్ కెరీర్ ఒకలా ఉంటే ఆ తర్వాత మరోలా ఉంది. హిందీలో తనకు లవ్ స్టోరీలు రావట్లేదని బాధపడుతున్న మృణాల్ కు తెలుగులో కథా బలం ఉన్న క్యారెక్టర్లు ఇస్తూ దర్శకనిర్మాతలు ఎంకరేజ్ చేస్తున్నారు.
బాలీవుడ్ లో రాని ఛాన్సులు టాలీవుడ్ నుంచి వస్తుండటంతో డబుల్ ఎనర్జీతో మృణాల్ సినిమాలు చేస్తుంది. సీతారామం తర్వాత మృణాల్ నటించిన హాయ్ నాన్న కూడా హిట్ అవడంతో భామ క్రేజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తోంది మృణాల్. ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఫ్యామిలీ స్టార్ తర్వాత మృణాల్ తర్వాతి సినిమా ఏంటన్నది ఇప్పటివరకు బయటకు రాలేదు. అవకాశాలొస్తున్నప్పటికీ తనకు బాగా నచ్చిన పాత్ర అయితేనే చేస్తానని నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. అందుకే గ్లామర్ రోల్స్ వచ్చినా చేయనంటోంది. కథల విషయంలో, తన పాత్ర విషయంలో మృణాల్ కఠినంగా ఉండటం వల్లే తనకు ఆఫర్లు రావడం లేదంటున్నారు. మరి తెలుగులో మృణాల్ నెక్ట్స్ సినిమాను ఎవరితో చేయనుందో చూడాలి.













