Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ ఏం చేయబోతున్నాడు?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటించిన పుష్ప2 సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం పుష్ప2(Pushpa2) సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న బన్నీ(Bunny) తర్వాత ప్లాన్ ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి పుష్ప2 తర్వాత త్రివిక్రమ్(Trivikram) తో ఓ సినిమాను చేయడానికి బన్నీ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాడు.
జులాయి(Julayi), సన్నాఫ్ సత్యమూర్తి(S/O Satyamurthy), అల వైకుంఠపురములో(Ala Vaikunthapurramulo) హ్యాట్రిక్ హిట్స్ తర్వాత వారిద్దరి కాంబోలో రానున్న సినిమా కావడం, దానికి తోడు త్రివిక్రమ్ చేస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో స్క్రిప్ట్ విషయంలో త్రివిక్రమ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అయితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి మరికొన్ని నెలలు టైమ్ పట్టనున్నట్లు సమాచారం.
మొదట్లో ఈ సినిమా 2025 సంక్రాంతికి మొదలవుతుందనుకున్నారు కానీ ఇప్పుడు ఈ సినిమా జూన్ వరకు సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ లేదని తెలుస్తోంది. అదే నిజమైతే బన్నీ 7 నెలల పాటూ ఖాళీగా ఉండే అవకాశముంది. ఈ 7 నెలల్లో మరో సినిమా చేసే ఛాన్స్ లేదు. కాబట్టి బన్నీ త్రివిక్రమ్ కోసం వెయిట్ చేయడం తప్పించి మరో ఆప్షన్ లేదు. ఈ గ్యాప్ ను బన్నీ తన ఫ్యామిలీతో గడపటంతో పాటూ కొత్త సినిమాల కథలను వినడానికి వాడుకోనున్నట్లు సన్నిహితులు చెప్తున్నారు. సుమారు రూ.700 కోట్ల బడ్జెట్ తో రూపొందనున్నఈ సినిమాను గీతా ఆర్ట్స్(Geetha Arts) తో పాటూ హారిక అండ్ హాసినీ క్రియేషన్స్(Harika & Haassinee Creations) బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.













