ప్రశాంత్ నీల్ ప్లాన్ ఏంటి?
దేశంలోని మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో లిస్ట్ లో ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా ఉన్నాడు. కేజీఎఫ్, సలార్ సినిమాలతో తన క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగింది. ఆయనతో సినిమాలు చేయడానికి పెద్ద హీరోలు సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీసెంట్ గా సలార్-1తో మంచి మిట్ అందుకున్న ప్రశాంత్ నీల్, తర్వాత ఏ సినిమా చేయబోతున్నాడనేది ఇప్పుడు అందరికీ ఆసక్తిగా మారింది.
వాస్తవానికి కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా చేయాల్సింది. కానీ దాని కంటే ముందే సలార్ స్టార్ట్ అయి, రిలీజ్ కూడా అయింది. ఇప్పుడు కూడా సలార్ అయ్యాక ప్రశాంత్ ఖాళీగా ఉన్న టైమ్ కు ఎన్టీఆర్ ఫ్రీ గా లేడు. దీంతో ఎన్టీఆర్- నీల్ కాంబోకి ఇంకాస్త టైమ్ పట్టేలా ఉంది. ప్రస్తుతం దేవరకు సంబంధించిన షూటింగ్, డబ్బింగ్ తో పాటూ ప్రమోషన్స్ కు కూడా తారక్ టైమ్ కేటాయించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్న వార్-2 షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. చూస్తుంటే ఓ ఏడాది పాటూ ఎన్టీఆర్, నీల్ కు అందుబాటులోకి రావడం కష్టంలానే ఉంది. దీంతో ప్రశాంత్ నీల్ ఈ లోపు సలార్-2ను పూర్తి చేయాలని చూస్తున్నాడట. సలార్-2 పూర్తయ్యే లోపు ఎన్టీఆర్ ఫ్రీ అవుతాడు కాబట్టి అప్పుడే ఎన్టీఆర్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లాలనుకుంటున్నాడట ప్రశాంత్ నీల్.













