హాయ్ నాన్న డైరెక్టర్ నెక్ట్స్ ఎవరితో?
నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన హాయ్ నాన్న సినిమా ఎంత మంచి సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ సినిమాతో శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. వైరా క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమాలో నానికి జోడీగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా బాగానే పెర్ఫార్మ్ చేసింది.
దీంతో మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన డైరెక్టర్ గా శౌర్యువ్ అందరి నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఇప్పుడు అతను తర్వాత ఎవరితో సినిమా చేయనున్నాడనేది అందరికీ ఆసక్తికరంగా మారింది. మొదటి సినిమాతోనే హిట్ అందుకోవడమనేది చాలా మంది డైరెక్టర్ల కల. ఆ కలను నెరవేర్చుకున్న శౌర్యువ్ నెక్ట్స్ ఎలాంటి సినిమాను తీస్తాడా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
హాయ్ నాన్న లాంటి సెన్సిటివ్ స్టోరీని ఎంతో గొప్పగా హ్యాండిల్ చేసిన శౌర్యువ్, రెండో సినిమా ఏ హీరోతో చేస్తాడో అని తన రెండో సినిమాపై ప్రేక్షకుల కన్ను పడింది. మొదటి సినిమాతో ఎలాగూ మంచి హిట్ అందుకున్నాడు కాబట్టి ఏ హీరో అయినా ఛాన్స్ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. శౌర్యువ్ తన తర్వాతి సినిమా విషయంలో ఎలాంటి ప్లాన్స్ చేసుకుంటున్నాడో తెలియాల్సి ఉంది.













