NTR: దేవర2 పరిస్థితేంటి తారక్?
దేవర(Devara) సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్న ఎన్టీఆర్(NTR), ఆ తర్వాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్(Hrithik Roshan) తో కలిసి వార్2(War2) చేసి రీసెంట్ గానే ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రశాంత్ నీల్(prasanth neel) దర్శకత్వంలో డ్రాగన్(Dragon) అనే సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ లో తారక్(Tarak) బిజీగా ఉన్నాడు.
డ్రాగన్ పై ఫ్యాన్స్ కు భారీ అంచనాలున్న నేపథ్యంలో ఈ సినిమాను ఆ అంచనాలకు మించి ఉండేలా నీల్ తెరకెక్కిస్తున్నాడట. వచ్చే ఏడాది జూన్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేయగా ఈ సినిమా తర్వాత తారక్ మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులను చేయడానికి ఉత్సాహంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందులో ముందుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) సినిమా తెరకెక్కనుందట.
ఇప్పటికే ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమా అఫీషియల్ గా అనౌన్స్ అయింది. కానీ ప్రస్తుతం త్రివిక్రమ్, వెంకీ(venky) సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. శుక్రవారం పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ సినిమా పూర్తవగానే త్రివిక్రమ్ తారక్ తో సినిమా చేయనున్నారు. త్రివిక్రమ్ మూవీతో పాటూ నెల్సన్(Nelson) డైరెక్షన్ లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ ను చేయడానికి కూడా తారక్ ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. అయితే వినడానికి ఇదంతా బాగానే ఉంది కానీ మరి దేవర2(Devara2) ఎప్పుడు చేస్తారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.







