50 ఏళ్ల వైజయంతీ సంస్థ.. సెలబ్రేషన్స్ ఎప్పుడు?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 ఏడీ భారీ విజయాన్ని సాధించింది. దీంతో నిర్మాత అశ్వినీదత్ ఎంతో ఆనందంగా ఉన్నాడు. అయితే తన నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ స్థాపించి ఈ సంవత్సరంతో 50 ఏళ్లు అయింది. అన్నగారు నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా మొదలైన ఈ బ్యానర్ ఎదురులేని మనిషి లాంటి భారీ సినిమాతో జర్నీని మొదలుపెట్టింది.
మొదటి సినిమా రిలీజైంది 1975లో అయినా బ్యానర్ మొదలుపెట్టింది మాత్రం 1974లోనే కావడంతో ఈ 50 ఏళ్ల సెలబ్రేషన్స్ ఈవెంట్ ను ఈ ఏడాది చేయాలా లేక వచ్చే ఏడాది నిర్వహించాలా అనేది ఆలోచిస్తున్నారు. కల్కి మంచి హిట్ అయిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఏదొక చోట భారీ ఈవెంట్ ను సక్సెస్ మీట్ లా ప్లాన్ చేసే ఆలోచనలో వైజయంతీ టీమ్ ఉందట.
ఈ ఈవెంట్ లోనే కల్కి2 ని కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయాలని చూస్తున్నారట. ఈ బ్యానర్ ను ప్రస్తుతం ప్రియాంక దత్, స్వప్న త్ తో పాటూ నాగ్ అశ్విన్ నడిపిస్తున్న తీరు ఎంతో బాగుంది. ఈ బ్యానర్ కు ఉన్న స్థాయిని మరింత పెంచేలా వారు చేస్తున్న ఆలోచనలు, సాహసాలు మంచి ఫలితాన్నిస్తున్నాయి. త్వరలోనే ఈ బ్యానర్ నుంచి మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు అనౌన్స్ కానున్నాయి.













