వృషకర్మ ట్రైలర్.. విజువల్ విధ్వంసం!
అక్కినేని నాగచైతన్య(Akkineni Nagachaitanya) హీరోగా కార్తీక్ దండు(Karthik dandu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మిస్టరీ థ్రిల్లర్ వృషకర్మ(Vrushakarma). ఇప్పటికే సాంగ్స్, మేకింగ్ వీడియోలతో ఆడియన్స్ లో ఆసక్తిని పెంచిన చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ప్రాచీన రహస్యాలు, అంతుచిక్కని సంఘటనలు, ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకునే ఓ అతీత శక్తి నేపథ్యంలో కథ సాగనున్నట్లు ట్రైలర్ ద్వారా వెల్లడించారు. ఆ శక్తి వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించే అర్జున్ పాత్రలో నాగచైతన్య కనిపించనున్నారు.
ఇవి కూడా చదవండి
ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ట్రైలర్లో నాగచైతన్య సరికొత్త అవతారం స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ డైరెక్టర్ కార్తీక్ దండు(Karthik Dandu) రూపొందించిన సీన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. భారీ విజువల్స్, అత్యున్నత స్థాయి వీఎఫ్ఎక్స్, అజనీష్ లోక్‌నాథ్(Ajaneesh Lokanath) బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు ప్రధాన బలంగా నిలిచాయి. ముఖ్యంగా నాగచైతన్య లుక్స్, యాక్షన్ సీన్స్ ఆయన ఫ్యాన్స్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి.
మీనాక్షి చౌదరి(Meenakshi chaudhary) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జయరామ్(Jayaram), స్పర్శ్ శ్రీవాస్తవ(Sparsh srivastava), కియారా ఖన్నా(Kiara Khanna) కీలక పాత్రలు పోషిస్తున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్(BVSN Prasad), సుకుమార్ రైటింగ్స్(Sukumar writings) భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో పాటు హాలీవుడ్ స్థాయి టెక్నికల్ వాల్యూస్ తో ఆడియన్స్ కు సరికొత్త అనుభూతిని అందించేందుకు చిత్రబృందం రెడీ అయింది. డిసెంబర్ 4న పలు భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న వృషకర్మ నాగచైతన్య కెరీర్లో ఎలాంటి మైలురాయిగా నిలుస్తుందో చూడాలి.







