తెలుగు మార్కెట్‌ను పట్టించుకోని విజయ్ సేతుపతి?
కోలీవుడ్‌లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి(Vijay sethupathi)కి తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి ఆదరణ ఉంది. హీరోగానే కాకుండా విలన్ గా, కీలక పాత్రల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఉప్పెన(Uppena) సినిమాతో తెలుగు ఆడియన్స్ కు మరింత చేరువైన ఆయనకు టాలీవుడ్ నుంచి వరుస అవకాశాలు వచ్చాయి. అయితే తమిళంలో బిజీగా ఉండటంతో తెలుగు సినిమాలకు ఎక్కువగా టైమ్ కేటాయించలేకపోయారు. గతంలో మహారాజా(Maharaja) సినిమా తెలుగులోనూ మంచి సక్సెస్ ను అందుకోవడంతో ఆయన మార్కెట్ మరింత విస్తరించింది.
అయితే ఇటీవల విజయ్ సేతుపతి తన తెలుగు మార్కెట్‌పై పెద్దగా దృష్టి సారించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన నటించిన బత్తా(Battha) తెలుగు వెర్షన్ సిద్ధమైనప్పటికీ థియేటర్లలో రిలీజ్ కాలేదు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమాను వీక్షించిన తెలుగు ఆడియన్స్ ఆయన యాక్టింగ్ పై ప్రశంసలు కురిపించారు. తాజాగా డిసెంబర్ 4న రిలీజ్ కానున్న ట్రైన్(Train) సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరగడం లేదని సమాచారం.
ఇవి కూడా చదవండి
మరోవైపు పూరి జగన్నాథ్(Puri Jagannadh) దర్శకత్వంలో విజయ్ సేతుపతి(Vijay sethupathi) నటించిన స్లమ్ డాగ్(Slum Dog) తెలుగు, తమిళ భాషల్లో భారీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. మణిరత్నం(Maniratnam) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంజి వెల్లం(Injivellam) 2027 జనవరిలో ఆడియన్స్ ముందుకు రానుంది. భాషతో సంబంధం లేకుండా విజయ్ సేతుపతి సినిమాలను ఆదరిస్తున్న తెలుగు ఆడియన్స్ కు ఆయన సినిమాలు థియేటర్లలో అందుబాటులోకి రాకపోవడం నిరాశ కలిగిస్తోంది. ఇప్పటికైనా ఆయన టీమ్ తెలుగు మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తే కెరీర్ పరంగా మరింత ప్రయోజనం చేకూరే అవకాశముంది.







