Viswambhara: విశ్వంభర మౌనం వీడాల్సిన టైమొచ్చింది

టాలీవుడ్ సీనియర్ హీరోలు ఈ వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీ పడి సినిమాలు చేస్తున్నారు. ఓ వైపు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) వరుస సినిమాలు చేస్తూ సూపర్ హిట్లు అందుకుని ఫుల్ జోష్ లో ఉంటూ తన తర్వాతి సినిమాలను పూర్తి చేస్తున్నాడు. అందులో భాగంగానే బాలయ్య(Balayya) బోయపాటి శ్రీను(Boyapati Srinu)తో కలిసి అఖండ2(Akhanda2) సినిమాను చేస్తున్నాడు. సెప్టెంబర్ 25న అఖండ2 రిలీజ్ కానున్నట్టు మేకర్స్ రీసెంట్ గా అనౌన్స్ చేశారు.
మరో వైపు చిరంజీవి(chiranjeevi) వశిష్ట(Vasishta) దర్శకత్వంలో విశ్వంభర(Viswambhara) అనే సోషియో ఫాంటసీ సినిమాతో పాటూ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో ఓ సినిమాను మొదలుపెట్టి ఫుల్ స్పీడ్ తో ఆ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే విశ్వంభర సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన ఆ సినిమా రిలీజ్ డేట్ ను మాత్రం అనౌన్స్ చేయలేదు. వాస్తవానికైతే విశ్వంభర మూవీ ఈ పాటికే రిలీజవాల్సింది.
కానీ షూటింగ్ లేటవడం, వీఎఫ్ఎక్స్ వర్క్స్ ఆలస్యం అవడం కారణంగా విశ్వంభర సినిమా వాయిదా పడుతూ వస్తుంది. విశ్వంభర కంటే చాలా లేటుగా మొదలైన అఖండ2 కూడా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంటే అదే ఫాంటసీ తరహాలో వస్తున్న విశ్వంభర టీమ్ మాత్రం రిలీజ్ డేట్ విషయంలో ఇంకా మౌనం వీడకపోవడం అందరినీ అసహనానికి గురి చేస్తుంది. ఇలా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల ఆడియన్స్ కు క్రమంగా విశ్వంభరపై ఉన్న అంచనాలు తగ్గే అవకాశముంది. కాబట్టి ఇప్పటికైనా విశ్వంభర టీమ్ రిలీజ్ డేట్ విషయంలో మౌనం వీడితే బెటర్.