విశ్వంభర టీజర్ టాక్
భోళా శంకర్(Bhola Shankar) తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మరీ చిరంజీవి(Chiranjeevi), డైరెక్టర్ వశిష్ట(vasishta)తో విశ్వంభర(Viswambhara) సినిమాను మొదలుపెట్టాడు. ఫాంటసీ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైపోవచ్చింది. దసరా సందర్భంగా ఇవాళ టీజర్ ను రిలీజ్ చేశారు. వాస్తవానికి ఈ సినిమా జనవరి 10న రిలీజ్ కావాల్సింది.
కానీ రామ్ చరణ్(ram Charan) గేమ్ ఛేంజర్(Game Changer) కోసం విశ్వంభరను వాయిదా వేసుకున్నాడు చిరూ(Chiru). ఇక విశ్వంభర టీజర్ విషయానికొస్తే 90 సెకన్ల నిడివి కలిగిన టీజర్ లో విశ్వంభర ప్రపంచం ఎలా ఉంటుందోనని కొన్ని విజువల్స్ ను శాంపిల్ గా చూపించారు. చీకట్లో రాజ్యమేలడానికి ఓ అరాచక శక్తి పూనుకున్నప్పుడు విశ్వానికి వెలుగు తీసుకురావడం కోసం కూడా ఒక యోధుడు పూనుకుంటాడు. అతనే విశ్వంభర.
వందల వేల సంవత్సరాల నాటి నేపథ్యంతో పాటూ ఫాంటసీ బ్యాక్ డ్రాప్ ను చాలా బలంగా జోడించాడు డైరెక్టర్ వశిష్ట. చిరూని తెల్లని గుర్రం మీద చూపించడంతో పాటూ ఆంజనేయ స్వామి విగ్రహం ముందు గూండాలను చితకబాదే సీన్స్ తో వశిష్ట క్లాస్, మాస్ ఆడియన్స్ ఇద్దరినీ శాటిస్ఫై చేసే ప్రయత్నం చేశాడని అర్థమవుతుంది. వీఎఫ్ఎక్స్ విషయంలో మంచి స్టాండర్డ్స్ మెయిన్టెయిన్ చేశారని చాలా స్పష్టంగా తెలుస్తోంది. మొత్తానికి టీజర్ ద్వారా ప్రాధమికంగా విశ్వంభరపై అంచనాలను పెంచడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు.













