Viswambhara: విశ్వంభర రిలీజ్ కోసం మరో సెంటిమెంట్
వాస్తవానికి మొన్న సంక్రాంతికే చిరంజీవి(Chiranjeevi) విశ్వంభర(Viswambhara) రావాల్సింది కానీ షూటింగ్ లేటవడంతో పాటూ కొన్ని ఇతర కారణాల వల్ల ఆ సినిమా వాయిదా పడింది. దీంతో విశ్వంభర ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో విశ్వంభర సమ్మర్ లో రిలీజవుతుందని కొన్ని వార్తలొచ్చాయి.
కానీ దానికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే ఇప్పటివరకు రాలేదు. ఇలాంటి టైమ్ లో విశ్వంభర రిలీజ్ డేట్ కు సంబంధించి ఓ వార్త నెట్టింట ప్రచారం జరుగుతుంది. విశ్వంభరను మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. యూవీ క్రియేషన్స్(UV Creations) బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాకు బింబిసార డైరెక్టర్ వశిష్ట(Vassishta) దర్శకత్వం వహిస్తున్నాడు.
సోషియో ఫాంటసీ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ కు ఎన్నో అంచనాలున్నాయి. జగదేకవీరుడు అతిలోక సుందరి(Jagadeka Veerudu Athiloka Sundari) సినిమా కూడా మే9 రోజునే రిలీజై చిరూ కెరీర్లోనే మంచి హిట్ గా నిలిచింది. ఇప్పుడు 35 ఏళ్ల తర్వాత మళ్లీ అదే సోషియో ఫాంటసీ మూవీగా రూపొందిన విశ్వంభర కూడా అదే రోజున రిలీజవడాన్ని మెగా ఫ్యాన్స్ హిట్ సెంటిమెంట్ గా భావిస్తున్నారు. త్రిష(Trisha) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కీరవాణి(Keeravani) సంగీతం అందిస్తున్నాడు.













