Raja Saab: రాజా సాబ్ తప్పుకుంటే విశ్వంభర రావడం ఖాయం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా మారుతి(Maruthi) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ది రాజా సాబ్(The Raja Saab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. కానీ ఈ సినిమా చెప్పిన డేట్ కు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇంకా సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ వర్క్స్ చాలా పెండింగ్ ఉండటంతో రిలీజ్ నాటికి అవి పూర్తవడం డౌట్ అంటున్నారు. ఈ కారణంతోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న మరో సినిమా మిరాయ్(Miraai) ను ఏప్రిల్ 18న రిలీజ్ చేస్తున్నారంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఒకవేళ రాజా సాబ్ పోస్ట్ పోన్ అయితే మాత్రం అదే డేట్ లో చిరంజీవి(Chiranjeevi) విశ్వంభర(Viswambhara)ని ఆ డేట్ లో రిలీజ్ చేయాలని యువి క్రియేషన్స్(UV Creations) చూస్తుందట.
ఇప్పటికే విశ్వంభర షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి అయింది. టీజర్ కు వచ్చిన నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ను దృష్టిలో ఉంచుకుని గ్రాఫిక్స్ పై టీమ్ మరో సారి వర్క్ చేస్తున్నట్టు సమాచారం. ఫిబ్రవరిలోగా అంతా ఓ కొలిక్కి తీసుకొచ్చి సంక్రాంతి లోగా ఓ డెసిషన్ తీసుకుని అన్నీ ఓకే అనుకుంటే సంక్రాంతికి ఫస్ట్ లిరికల్ ను రిలీజ్ చేయాలని విశ్వంభర టీమ్ చూస్తుందట. ఏదేమైనా ఇదంతా రాజా సాబ్ రిలీజ్ డేట్ పైనే ఆధారపడి ఉంది.













