చిరూ వెయిట్ చేస్తాడా లేదా స్టార్ట్ చేస్తాడా?
భోళా శంకర్ సినిమా తర్వాత చిరంజీవి కొంత గ్యాప్ తీసుకుని తన తర్వాతి సినిమా విశ్వంభరను యంగ్ డైరెక్టర్ వశిష్టతో చేస్తున్నాడు. సోషియో ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది. షూటింగ్ మొత్తం దాదాపు హైదరాబాద్లోనే జరుగుతుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో స్పెషల్ సెట్స్ లో షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ దశకు వచ్చినట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. కానీ అందులో ఎంతవరకు నిజముందన్నది తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర యూనిట్ క్లైమాక్స్ లోని యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నట్లు యూనిట్ తెలిపింది. స్పెషల్ గా డిజైన్ చేసిన సెట్ లో స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వంలో ఈ షూటింగ్ జరుగుతుంది.
సినిమా మొత్తంలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ నిలవనున్నట్లు చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే చిరంజీవి విశ్వంభర షూటింగ్ నుంచి త్వరలోనే బయటికి రానున్నట్లు తెలుస్తోంది. సోషియో ఫాంటసీ సినిమా కావడంతో గ్రాఫిక్స్ కు ఎక్కువ టైమ్ పడుతుంది. అంటే దాదాపు నాలుగు నెలల పాటూ గ్రాఫిక్స్ వర్క్స్కే టైమ్ పట్టనుంది. మరి ఈ లోపు చిరూ కొత్త సినిమాను మొదలుపెడతారా లేదా ఈ సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేసి ఆ తర్వాత కొత్త సినిమాను స్టార్ట్ చేస్తారా అన్నది చూడాలి.













