ఈ మెగా కన్ఫ్యూజన్ తీరేదెప్పటికో..?
టాలీవుడ్(Tollywood) సినిమాలకు బిగ్గెస్ట్ సీజన్ అంటే సంక్రాంతినే. ఆ సీజన్ కోసం ఎన్నో సినిమాలు ఎంతో ముందునుంచే పోటీ పడుతుంటాయి. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ప్రతి ఏడాదీ సంక్రాంతికి ఏ సినిమాలు రిలీజవుతాయనే విషయంలో ఎంతో ఆసక్తి నెలకొంటుంది. కొన్ని సినిమామలు చాలా ముందుగా రేసులో నిలబడితే కొన్ని సడెన్ గా వచ్చి చేరుతూ ఉంటాయి.
కానీ చివరకి మాత్రం నాలుగైదు సినిమాలే రిలీజవుతుటాయి. అయితే నెక్ట్స్ ఇయర్ సంక్రాంతికి ఎంతో ముందుగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న సినిమా చిరంజీవి(Chiranjeevi) విశ్వంభర(Viswambhara). మొన్నటివరకు ఈ సినిమా సంక్రాంతికి రావడం పక్కా అనుకున్నారు కానీ ఇప్పుడు కథ మొత్తం మారింది. ఉన్నట్టుండి విశ్వంభర టీమ్ సైలెంట్ అయిపోయింది.
షూటింగ్ దాదాపు పూర్తైనప్పటికీ వీఎఫ్ఎక్స్ భారీగా అవసరం ఉండటం వల్ల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అనుకున్న టైమ్ కు పూర్తయ్యేలా కనిపించకపోవడంతో విశ్వంభ వాయిదా పడుతుందని వార్తలొస్తున్నాయి. దీంతో విశ్వంభర స్లాట్ ను క్రిస్మస్ కు వద్దామనుకున్న రామ్ చరణ్(ram Charan) గేమ్ ఛేంజర్(Game Changer) తీసుకునేలా కనిపిస్తోంది. దీని వల్ల బాక్సాఫీస్ వద్ద చాలా అడ్వాంటేజ్ ఉంటుందని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కు కూడా ఇంకాస్త టైమ్ దొరుకుతుందని నిర్మాత దిల్ రాజు(Dil Raju) భావిస్తున్నారట. ఈ రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్స్ కు ఎప్పుడు క్లారిటీ వస్తుందోనని మెగా ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.













