ఆ హీరో వద్దన్న సినిమాను విశ్వక్ చేస్తున్నాడా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టోరీలు, డైరెక్టర్లు ఒక హీరో దగ్గర నుంచి మరో హీరో దగ్గరకు వెళ్లడం అనేది చాలా కామన్. అయితే ఆ సినిమా రిజల్ట్ చూశాక ఆ నిర్ణయం కరెక్టా కాదా అనేది తెలుస్తుంది. విశ్వక్ హీరోగా, సితార ఎంటర్టైన్మెంట్స్ తమ 21వ సినిమాను అనౌన్స్ చేసింది. పెద్దగా వివరాలైతే చెప్పలేదు కానీ సినిమాను లాంఛ్ చేయడానికి అన్నట్లు అనౌన్స్ చేయడానికి రిలీజ్ చేసిన వీడియాలో మ్యూజిక్ డైరెక్టర్ గా యువన్ శంకర్ రాజా పేరును హైలైట్ చేశారు.
అయితే ఈ సినిమా వెనుక ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. ఈ సినిమా డైరెక్టర్ కృష్ణ చైతన్య రౌడీ ఫెలో అనే సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు. తర్వాత నితిన్ తో చల్‌మోహన్‌రంగా చేశాడు. పవన్ కళ్యాణ్ నిర్మించిన ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు.
దీంతో మళ్లీ నితిన్ తోనే మరో సినిమాను పవర్ పేట అనే టైటిల్‌తో గ్యాంగ్‌స్టర్ డ్రామానా ప్లాన్ చేసి అనౌన్స్ చేశాడు. స్క్రిప్ట్ వర్క్ అంతా కూడా అయింది. కానీ ఎందుకో కానీ ఈ సినిమా ముందుకెళ్లలేదు. అనుకోనివిధంగా చాలానే గ్యాప్ వచ్చింది. తర్వాత నితిన్ కూడా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు నితిన్ తప్పుకున్న ఆ స్క్రిప్ట్‌తోనే కృష్ణ చైతన్య, విశ్వక్ ని పెట్టి సినిమా తీస్తున్నాడని టాక్ నడుస్తుంది.
ఆల్రెడీ రిలీజ్ చేసిన వీడియోలో విజువల్స్ కూడా ఈ విషయానికి సింక్ అవుతున్నాయి. పైగా నెగిటివ్, డార్క్ అంటూ హింట్స్ కూడా ఇచ్చారు. త్వరలోనే షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. ఏదైతే ఏంటి ఇన్నాళ్లకు మళ్లీ కృష్ణ చైతన్య నుంచి సినిమా వస్తుండటం ఆనందించాల్సిన విషయం.













