స్టార్ హీరో విక్రమ్ కు అరుదైన గౌరవం
స్టార్ హీరో చియాన్ విక్రమ్ అరుదైన గౌరవం దక్కింది. దుబాయ్ ప్రభుత్వం తాజాగా ఆయన గోల్డెన్ వీసా ఇచ్చింది. ఈ విషయాన్ని నటి పూర్ణ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తన భర్తతో కలిసి పూర్ణ విక్రమ్ దుబాయ్ గోల్డెన్ వీసా అందిస్తున్న ఫొటోను ఈ సందర్భంగా ఆమె షేర్ చేసింది. పూర్ణ భర్త షానిద్ ఆసీఫ్ అలీ యూఏఈలో బడా వ్యాపారస్తుల్లో ఒకరనే విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ ఆయన పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. అయితే షానీద్ తన కంపెనీ ద్వారా విక్రమ్‌కి గోల్డెన్ వీసా వచ్చేలా చేశాడని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా సినీ, సాహిత్యం, విద్య, కల్చర్ ఇతర రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారికి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు అందిస్తుంది. ఈ గోల్డెన్ వీసా ద్వారా అరబ్ దేశాల్లో ఎలాంటి పరిమితులు లేకుండా నివసించవొచ్చు.













