వావ్ అనిపిస్తున్న విజయ్ సేతుపతి మేకోవర్…
కోలీవుడ్ లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి తన కెరీర్ ని చిన్న పాత్రలతో మొదలుపెట్టి ఇప్పుడు ఎలాంటి పాత్రనైనా చేయగలడు అనే రేంజ్ కి వచ్చాడు. విజయ్ కెరీర్ గ్రాఫ్ చూస్తే వావ్ అనకుండా ఉండలేరు. తమిళ ఇండస్ట్రీతో పాటు తెలుగు ఇండస్ట్రీలో కూడా విజయ్ సేతుపతికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది.
‘ఉప్పెన’ తో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు విజయ్. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఇతడు ఈ మధ్య తన లుక్స్ తో ఫాన్స్ ని నిరాశ పరిచాడు. పాత్ర డిమాండ్ చేయడం వల్లనో, సరైన డైట్ తీసుకోకపోవడం వల్లనో కాస్త బొద్దుగా కనిపించారు విజయ్ సేతుపతి. ఆఖరికి ఫాన్స్ రిక్వెస్ట్ మీద తన లుక్స్ పై కాన్సన్ట్రేట్ చేసాడు ఈ హీరో.
సరికొత్త లుక్ తో కనిపించి సర్ప్రైజ్ చేసారు విజయ్ సేతుపతి. ఈ మేకోవర్ సినిమా కోసమా? లేక నార్మల్ గానే తన లుక్స్ చేంజ్ చేసారా? అనేదానిపై క్లారిటీ లేదు. అయితే ఈ స్లిమ్ లుక్ మాత్రం ప్రేక్షకులకు, విజయ్ ఫాన్స్ కి చాల బాగా నచ్చేసింది. అంతేకాదు ఈ లుక్ లో ఆయన సోలో హీరోగా సినిమాలు చేస్తారని అంటున్నారు. ఫ్యాన్స్ అందరు మక్కల్ సెల్వన్ గా పిలిచే విజయ్ సేతుపతి సినిమా కోసం ఎలాంటి రిస్క్ అయిన సరే తీసుకుంటారు. అందుకే ఆయన కెరీర్ ఈ రేంజ్ లో దూసుకెళ్తుందని చెప్పొచ్చు.
ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలే కాదు హిందీలో కూడా రెండు మూడు సినిమాలు చేస్తున్నారు విజయ్ సేతుపతి. ఆల్రెడీ షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమాలో విజయ్ సేతుపతినే మెయిన్ విలన్ అని చెబుతున్నారు. ఆయన చేసిన పాత్ర సూపర్ హిట్ కాగా అలాంటి రోల్స్ తోనే టాలీవుడ్ నుంచి చాలా ఆఫర్లు వచ్చాయట. అన్నీ ఒకేలాంటి రొలెస్ వస్తుండడంతో విజయ్ కాదనుకున్నారట. అదీగాక తమిళ హిందీ ప్రాజెక్ట్ లతో విజయ్ సేతుపతి సూపర్ బిజీగా ఉన్నారు. అందుకే తెలుగు ఆఫర్లకు యెస్ చెప్పట్లేదని తెలుస్తుంది.
తన లేటెస్ట్ లుక్ తో ఫ్యాన్స్ ని అలరిస్తున్న విజయ్ సేతుపతి సెల్ఫీ తీసుకుని మరీ తన న్యూ లుక్ ని ఆడియన్స్ కి షేర్ చేశారు. సినిమాల్లో ఎంత విలనిజం చూపించినా తన ఫ్యాన్స్ విషయంలో చాలా క్లోజ్ గా ఉంటారు విజయ్ సేతుపతి. తన న్యూ లుక్ తో ప్రేక్షకులని ఆకట్టుకొని మరిన్ని ప్రాజెక్ట్స్ ని సొంతం చేసుకోవాలని కోరుకుందాం.













