Vijay Sethupathi: ‘ఫీనిక్స్’ నాకు చాలా నచ్చింది. ఈ సినిమా మా అబ్బాయికి మంచి ఆరంభం- విజయ్ సేతుపతి
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి హీరోగా పరిచమైన చిత్రం ఫీనిక్స్.(Phoenix) ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహించారు. ఏకే బ్రేవ్మ్యాన్ పిక్చర్స్ బ్యానర్ పై రాజలక్ష్మి ‘అన్ల్’ అరసు ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే తమిళ్ లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం తెలుగులో నవంబర్ 7 రిలీజ్ కానుంది. ఈ సందర్భం మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ వేడుకకు వచ్చిన గోపీచంద్ గారికి థాంక్యూ. ఆయన చెప్పిన మాటలు మాకు ఎంతో ఆనందాన్నిచ్చాయి. నేను జవాన్ సినిమా చేస్తున్నప్పుడు అనల్ అరసు మాస్టర్ గారిని కలిసాను. అప్పుడు ఈ కథ చెప్పారు. మా అబ్బాయి ఇందులో నటించాలని అన్నారు. మీ ఇద్దరు మాట్లాడుకోండి అని చెప్పాను. ఆ తర్వాత నాకు ఏమీ తెలియదు. వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారు. సినిమా చేశారు. నేను సినిమా చూశాను. నాకు చాలా నచ్చింది. ఇది మా అబ్బాయికి చాలా మంచి ఆరంభం. ఒక తండ్రిగా నేను చాలా ఆనందంగా ఉన్నాను. తనకు చిన్నప్పటి నుంచి యాక్షన్ సినిమా చేయాలని ఉండేది. తనకి యాక్షన్ చాలా ఇష్టం. నన్ను యాక్షన్ సినిమాలు చేయమని చెప్తుండేవాడు. తనకి మాస్ యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టం. యాక్షన్ సినిమాని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాడు. అలాంటి సినిమాలు చేయడం తన కల. ఒకరోజు తను యాక్టర్ కావాలి అని చెప్పాడు. అలా చెప్పిన ఏడాదిలోనే సినిమా చేశాడు.
అదంతా డైరెక్టర్ అనల్ అరసు మాస్టర్, నిర్మాత రాజ్యలక్ష్మి మేడం గారి వలన సాధ్యపడింది. ఈ సినిమాకి తెలుగులో డైలాగ్స్ రాసిన భాష్యశ్రీ గారికి థాంక్యూ. నేను ప్రస్తుతం పూరి గారి సినిమా చేస్తున్నాను. ఆ సినిమా పూర్తయ్యేలోగా తెలుగులో చాలా స్పష్టంగా మాట్లాడుతాను. కవితలు కూడా రాస్తాను( నవ్వుతూ). అప్పటివరకు కొంచెం నా తెలుగులో అడ్జస్ట్ అవ్వండి(నవ్వుతూ) వరలక్ష్మి గారు నేను చాలా మంచి ఫ్రెండ్స్ . తనకి చాలా హై ఎనర్జీ ఉంటుంది. సినిమాకి సినిమా ఏ భాషలో ఉన్న అందులో ఎమోషన్ కనెక్ట్ అయితే ప్రతి ఒక్కరూ సినిమాని సెలబ్రేట్ చేస్తారు. అందుకే మనం అన్ని భాషలు సినిమాలు చూస్తాం. ఫినిక్స్ విషయంలో కూడా అది జరుగుతుంది. ఇందులో యాక్షన్ ఎమోషన్ అన్ని చాలా అద్భుతంగా కుదిరాయి. తప్పకుండా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. నవంబర్ 7న సినిమా రిలీజ్ అవుతుంది. అందరం థియేటర్స్ లో కలుద్దాం.
డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. విజయ్ సేతుపతి గారు అంటే నాకు చాలా ఇష్టం. వరలక్ష్మీ శరత్ కుమార్ మా జయమ్మ. తనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంటుంది. విజయ సేతుపతి గారితో నాకు వర్క్ చేయాలని ఉంది. అయితే నేను చెప్పిన కథ ఆయనకి నచ్చాలి. రీసెంట్ గా నేను జాట్ సినిమా చేశాను. అనల్ అరసు మాస్టర్ సూపర్ యాక్షన్ చేశారు. యాక్షన్ కొరియోగ్రఫీని ఒక కథ లాగా చెప్పారు. ఫీనిక్స్ ట్రైలర్ చాలా ఎక్స్ట్రార్డినరీగా అనిపించింది. ఈ సినిమా తమిళ్లో రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. సూర్య వెల్కమ్ టు తెలుగు. సినిమా బాగుందంటే ఏ భాష అయినా సరే వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటారు. విజయ్ గారిని అలానే గుండెల్లో పెట్టుకున్నారు. సూర్యకి కూడా అలాగే వెల్కమ్ చెప్తూ తెలుగులో కూడా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.
హీరో సూర్య సేతుపతి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఫీనిక్స్ సినిమా నవంబర్ 7న రిలీజ్ అవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాతకి కృతజ్ఞతలు. వరలక్ష్మి గారికి గోపీచంద్ గారికి మా నాన్నగారికి థాంక్యూ. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉంది.
వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. విజయ్ సేతుపతి గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. వాళ్ళ అబ్బాయి సినిమా అనగానే మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పాను. తమిళ్లో చాలా పెద్ద హిట్ అయింది. తెలుగులో కూడా అలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందని నమ్ముతున్నాను. సూర్యకి మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను
డైరెక్టర్ అనల్ అరసు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఫీనిక్స్ ఆల్రెడీ తమిళ్ లో రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. తెలుగులో కూడా అంత పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను. విజయ్ సేతుపతి గారికి థాంక్యూ. తమిళ్ లో సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ అద్భుతంగా పెర్ఫాం చేశారు. నిర్మాత చాలా సపోర్ట్ ఇచ్చారు. సూర్యకి చాలా టాలెంట్ ఉంది. మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన గోపీచంద్ గారికి థాంక్యూ. నవంబర్ 7న సినిమా రిలీజ్ అవుతుంది. మీ అందరికి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను.
రైటర్ భాష్యశ్రీ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. సూర్య గారు చాలా అద్భుతంగా చేశారు. ఈ సినిమాకి నేను మాటలు పాటలు రాశాను. ప్రతి సీన్ చాలా బాగుంటుంది .నాకు అవకాశం ఇచ్చిన మా నిర్మాత గారికి థాంక్యూ. ఈ సినిమా చూడండి. మీరు ఎవరు ఊహించని ట్విస్టులు ఉంటాయి. ఎమోషన్ యాక్షన్ లో అన్నీ కలిసిన సినిమా ఇది. అందరికీ నచ్చుతుంది. విజయ్ సేతుపతి గారిని ఆశీర్వదించినట్టే వాళ్ళ అబ్బాయిని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.
ప్రొడ్యూసర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం, విజయ్ గారికి వరలక్ష్మి గారికి గోపీచంద్ గారి థాంక్యూ. నవంబర్ 7న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.







