అవును.. ఆ ఛాన్స్ మిస్ చేసుకున్న విజయ్
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ సినిమాతో ముందుకొచ్చిన విజయ్ ఆ సినిమాతో అనుకున్న అంచనాలను తిప్పికొట్టడంతో భారీ డిజాస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం విజయ్, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఎంతో వేగంగా జరుగుతోంది.
త్వరలోనే ఈ సినిమా నుంచి గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ సినిమా కాకుండా రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా, రాహుల్ సాంకృత్స్యన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఆ సినిమాలు త్వరలోనే మొదలుకానున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు విజయ్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
సూపర్ హిట్, హర్రర్ థ్రిల్లర్ అవును సినిమాలో నటించే అవకాశాన్ని విజయ్ మిస్ చేసుకున్నాడట. రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూర్ణ భర్తగా విజయ్ దేవరకొండనే నటించాల్సిందట. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన చేయకపోవడంతో ఆ పాత్రను హర్షవర్ధన్ రాణే చేసినట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ ఓ సూపర్ హిట్ సినిమాను మిస్ చేసుకున్నాడని అందరూ అంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రవిబాబే ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.













