లెక్క తప్పుతున్న విజయ్
రీసెంట్ గా రిలీజైన్ ది ఫ్యామిలీ స్టార్ సినిమాకు మిక్డ్స్ టాక్ రావడంతో కలెక్షన్లు అనుకున్న స్థాయిలో రావడం లేదు. తమ సినిమా ఆడియన్స్ కు 90% నచ్చిందని, అందరూ ఫోన్లు, మెసేజ్‌లు చేసి అభినందిస్తున్నారని దిల్ రాజు చెప్తున్నప్పటికీ నెట్టింట ట్రెండ్స్, పబ్లిక్ టాక్, రివ్యూల్లో మాత్రం అంచనాలను అందుకోలేదన్నది అర్థమవుతుంది.
ఫైనల్ గా సినిమా హిట్టా ఫట్టా అనేది చెప్పడానికి టైమున్నప్పటికీ విజయ్ దేవరకొండ ఇప్పటికైనా తనెలాంటి సినిమాలు చేస్తున్నాడనేది రియలైజ్ అవ్వాల్సిన టైమ్ వచ్చింది. క్వాలిటీ, కంటెంట్ పరంగా భారీ ఎత్తున ప్రమోషన్స్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్ మూవీకి అనుకున్న స్థాయిలో ఓపెనింగ్స్ కూడా రాలేదనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం.
గతంలో విజయ్ కు ఉన్న క్రేజ్‌కు, ఇప్పటి క్రేజ్‌కు చాలా తేడా కనిపిస్తుంది. ఈ తేడా లైగర్ వల్ల వచ్చిందా ఏంటన్నది విజయ్ ఆలోచించాల్సి ఉంది. సరైన సబ్జెక్ట్ తో వస్తే రిసీవ్ చేసుకోవడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారు. దాని గురించి వదిలేసి విజయ్ తను పడిన కష్టాలు, ఎలివేషన్స్, ప్రమోషన్స్ మీద దృష్టి పెడుతున్నాడు. కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేయొద్దనుకోవడం మంచిదే కానీ ఎక్స్పీరియన్డ్స్ డైరెక్టర్లతో కూడా విజయ్ మంచి కంటెంట్ తో రానప్పుడు ఏ డైరెక్టర్ అయితే ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా విజయ్ ఈ విషయంలో తనను తాను ఆత్మ విమర్శ చేసుకుంటే బెటర్.













