బాలీవుడ్లో టాక్సీవాలా
విజయ్ దేవరకొండ తెలుగులో హీరోగా నటించిన టాక్సీవాలా సినిమా హిందీలో రీమేక్ అవుతున్నట్టుగా తెలిసింది. ఈ సినిమా తెలుగులో బాగానే ఆడింది. విడుదలలో జాప్యం జరిగినా, అప్పటికే పైరసీ వర్షన్ నెట్లోకి వచ్చినా ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటికే కారులో దెయ్యం అనే కాన్సెప్ట్‌తో పలు సినిమాలు వచ్చాయి. అయినా వియ్ దేవరకొండ సినిమా బాగానే ఆడింది. నయనతార సినిమా ఒకటి కూడా అదే తరహాలోనే ఉంటుంది. అయినా టాక్సీవాలా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా హిందీ రీమేక్ గురించి అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు సైలెంట్‌గా ఈ సినిమా రీమేక్ రూపొందుతోందని సమాచారం. హిందీ వర్షన్ లో ఇషాన్ ఖట్టర్ హీరోగా నటిస్తున్నాడని తెలిసింది.













