ఫ్యామిలీ స్టార్‌కు సంక్రాంతి టార్గెట్ కష్టంగానే ఉంది
గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ పెట్ల కాంబినేషన్లో వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఫ్యామిలీ స్టార్‌ను సంక్రాంతికి థియేటర్లలో దింపాలని దిల్ రాజు టార్గెట్ పెట్టుకుని మరీ షూటింగ్ ను చేయిస్తున్నాడు.
కానీ ఫ్యామిలీ స్టార్ సంక్రాంతి టార్గెట్‌ను రీచ్ అవుతుందా లేదా అన్నది ఇప్పుడు అనుమానంగా మిగిలింది. ఈ మూవీకి సంబంధించిన ఫారిన్ షెడ్యూల్ పెండింగ్ ఉండటంతో దానికి సంబంధించిన వర్క్స్ వల్ల సినిమా పోస్ట్ పోన్ అవుతుందా అని వార్తలు వినిపిస్తున్నాయి. వీసా ప్రాబ్లమ్స్ వల్ల ఈ ఫారిన్ షెడ్యూల్ ఆగిపోయింది. ఈ షెడ్యూల్ ఇంకా లేట్ అయితే మాత్రం ఫ్యామిలీ స్టార్ జనవరిలో రావడం కష్టమనే అనుకోవాలి.
ఏదేమైనా సరే సంక్రాంతి టార్గెట్ ను రీచ్ కావాలనే ఉద్దేశంతో పరశురామ్ స్పెషల్ గా ఓ ఎడిటింగ్ రూమ్ ను రెడీ చేయించి మరీ వర్క్స్ చేయిస్తున్నట్లు సమాచారం. ఇంత ప్రెజర్ లో మళ్లీ బిజినెస్, ప్రమోషన్స్, ట్రైలర్ ఈవెంట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రెస్ మీట్స్ అంటూ చాలా ఉంటాయి. వీటన్నింటినీ మేనేజ్ చేయడానికి టైమ్ ఉన్నప్పటికీ ఫారిన్ షెడ్యూల్ లేటయితే మాత్రం చాలా హడావిడి ఉండటం మాత్రం ఖాయం. మరి ఇన్ని సందేహాల మధ్య ఫ్యామిలీ స్టార్ సంక్రాంతికి వస్తాడో లేదో చూడాలి.













