Vijay Devarakonda: రూమర్లపై రెస్పాండ్ అయిన విజయ్
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) పర్సనల్ లైఫ్ గురించి చాలా డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో ఈ రూమర్లపై విజయ్ తాజాగా రెస్పాండ్ అయ్యాడు. డేటింగ్ వార్తలు వైరలవుతున్న విషయం తనకు తెలుసని, కానీ ఈ విషయంపై స్పందించడానికి తనకు సరైన టైమ్ కావాలని విజయ్ దేవరకొండ వెల్లడించాడు.
తాను పబ్లిక్ ఫిగర్ అని, తనకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని అందరికీ ఇంట్రెస్ట్ ఉండటం సహజమేనని, కానీ తన లైఫ్ లో ఓ స్పెషల్ టైమ్ వచ్చినప్పుడు మాత్రమే వాటిని షేర్ చేసుకుంటానని విజయ్ తెలిపాడు. అంతేకాదు ఈ వార్తలను ప్రెజర్ గా అనుకోనని కూడా విజయ్ క్లారిటీ ఇచ్చాడు. పబ్లిక్ ఫిగర్ గా ఉండటం వల్ల చాలా వార్తలొస్తాయని వాటిని నార్మల్ గానే తీసుకుంటానని విజయ్ ఈ సందర్భంగా చెప్పాడు.
అంతేకాదు, అపారమైన ప్రేమ ఉంటే దాని వెంట బాధ కూడా తప్పదని, ప్రేమించడమంటే బాధను కూడా పంచుకోవడమని విజయ్ అన్నాడు. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri) దర్శకత్వంలో సినిమా చేస్తున్న విజయ్ ఆ తర్వాత రాహుల్ సాంకృత్స్యన్(Rahul Sankrityan) తో ఓ సినిమా, రవికిరణ్ కోలా(Ravi Kiran Kola) దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.













