అందుకే దిల్ రాజు సంక్రాంతికి ప్లాన్ చేశాడా?
వచ్చే సంక్రాంతికి ఇప్పటికే ఎన్నో పెద్ద సినిమాలు రిలీజ్‌కు షెడ్యూల్ అయి ఉన్నాయి. అయితే ఆఖరికి ఈ రేసులో ఎవరుంటారు ఎవరు తప్పుకుంటారనేది డేట్ దగ్గర పడితే కానీ తెలియదు. ఎట్టి పరిస్థితుల్లో సినిమాను సంక్రాంతికి రలిఈజ్ చేస్తామని చెప్పిన సినిమాలు గుంటూరు కారం, హనుమాన్, ఈగల్. ఎలాగూ సలార్ సినిమా డిసెంబర్ లో రిలీజ్ అంటున్నారు కాబట్టి టెన్షన్ లేదు.
ఇంత పోటీ మధ్యలో దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ, పరశురామ్ పెట్ల కాంబినేషన్లో వస్తున్న ఫ్యామిలీ స్టార్‌ను సంక్రాంతికి దింపాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పటికే ఈ విషయంలో హింట్ కూడా ఇచ్చారు. ఓ వైపు మహేష్ బాబు, రవితేజలను పోటీలో ఉంచుకుని విజయ్ తో దిల్ రాజు ఇంత రిస్క్ ఎందుకు చేస్తున్నాడా అని అందరూ అనుకుంటున్నారు.
కానీ దానికి దిల్ రాజు లెక్కలు వేరుగా ఉన్నాయి. ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో పాటూ విజయ్ తో వారసుడు అనే డబ్బింగ్ సినిమాను బరిలో దింపి, రొటీన్ కంటెంట్‌తో మంచి లాభాలు అందుకున్నాడు. గతంలో ఖైదీ నెం.150, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలతో శర్వానంద్ శతమానం భవతి సినిమాను రిలీజ్ చేసి బంపర్ హిట్ కొట్టిన చరిత్ర దిల్ రాజు కు ఉంది.
ఇప్పుడు కూడా ఆ నమ్మకంతోనే దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ అనే సినిమాను రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. మంచి కంటెంట్ ఉంటే ఎన్ని సినిమాలకైనా బ్రేక్ ఈవెన్ చేసే సత్తా సంక్రాంతి సీజన్ కు ఉంది. దానికి తోడు ఈ సినిమాకు వెనుక దిల్ రాజు ఉన్నాడు. విజయ్- పరశురామ్ కాంబో కూడా దీనికి ప్లస్ కానుంది. నెక్ట్స్ సంక్రాంతికి ఈ సినిమా దిల్ రాజు కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి మరి.













