VD12: ఆ ఎపిసోడ్కు థియేటర్లు షేకవుతాయట
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) జెర్సీ(Jersey) ఫేమ్ గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri) కలయికలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. విజయ్ కెరీర్లో 12(VD12)వ సినిమాగా ఇది తెరకెక్కుతుంది. 2025 మార్చి 28న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన విజయ్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేలా ఉంది.
ఆ లుక్ లో విజయ్ నెవర్ బిఫోర్ మాస్ గెటప్ లో చాలా ఇంటెన్స్ గా కనిపించాడు. ముఖంపై గాయాలతో రక్తం కారుతూ షార్ట్ హెయిర్ లో కనిపించాడు. ఈ సినిమా టైటిల్ త్వరలోనే అనౌన్స్ చేస్తారని ఎప్పట్నుంచో అంటున్నారు తప్పించి దాని గురించి అప్డేట్ మాత్రం రావడం లేదు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి తర్వాత గోవా షెడ్యూల్ జరుపుకోనుందని సమాచారం.
గోవా షెడ్యూల్ తర్వాత చిత్ర యూనిట్ అంతా కలిసి కోల్కతా వెళ్లనున్నారని, అక్కడ పది రోజుల వరకు షూటింగ్ చేయనున్నారని సమాచారం. కోల్కతా షెడ్యూల్ లో షూట్ చేయబోయే హిస్టారికల్ ఎపిసోడ్ థియేటర్లను షేక్ చేస్తుందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం ఈ విషయం ఫిల్మ్ నగర్ లో బాగా చక్కర్లు కొడుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Enteretainments) బ్యానర్ లో నాగవంశీ(Naga Vamsi) నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్(Anirudh) సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.













