Vijay Devarakonda: గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న రౌడీ హీరో

శేఖర్ కమ్ముల(sekhar kammula) దర్శకత్వంలో ధనుష్(dhanush), నాగార్జున(nagarjuna) ప్రధాన పాత్రల్లో రష్మిక మందన్నా(Rashmika Mandanna) హీరోయిన్ గా వచ్చిన సినిమా కుబేర(Kubera). జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద హిట్ దిశగా దూసుకెళ్తుంది. కంటెంట్ బావుండటంతో పాటూ సినిమా ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అవడంతో కుబేరకు థియేటర్లు హౌస్ ఫుల్స్ అవుతున్నాయి.
కుబేర సినిమా చూసిన వాళ్లంతా అందులో ధనుష్ యాక్టింగ్ కు ఫిదా అవడంతో పాటూ మరోసారి అతనికి నేషనల్ అవార్డు కన్ఫర్మ్ అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ధనుష్ ఆ సినిమా స్థాయిని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాడు. అయితే కుబేరలో దేవా(Deva) పాత్రకు మొదట శేఖర్ కమ్ముల అనుకున్నది ధనుష్ ను కాదట. కుబేరలోని బిచ్చగాడి పాత్రను విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో చేయించాలని శేఖర్ కమ్ముల అనుకున్నాడట.
కుబేర కథను శేఖర్ కమ్ముల ముందుగా విజయ్ దేవరకొండకే చెప్పాడట. కానీ బిచ్చగాడి పాత్రకు తాను సూటవనని చెప్పి విజయ్ ఆ సినిమాను రిజెక్ట్ చేశాడట. అలా విజయ్ వద్దనుకున్న కుబేరను ధనుష్ చేసి అందరి నుంచి మంచి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు కుబేర రిలీజయ్యాక విజయ్ బంగారం లాంటి అవకాశాన్ని మిస్ అయ్యాడని అతని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అందుకే అంటారు ఏది ఎవరికి రాసిపెట్టి ఉంటే వాళ్లే అది చేస్తారని.